Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSmart Phones: కేవలం రూ.7 వేల లోపు లభించే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు..

Smart Phones: కేవలం రూ.7 వేల లోపు లభించే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు..

Branded Smart Phones under 7K: తక్కువ ధరకు గొప్ప పనితీరు కలిగిన ఫోన్ కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్! మార్కెట్లో మూడు అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు రూ.7000 కంటే తక్కువ ధరకే  కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్ విభాగంలో రియల్ మీ నుంచి శామ్సంగ్ వరకు వంటి గొప్ప బ్రాండ్ పరికరాలు ఉన్నాయి. ఇవి తక్కువ బడ్జెట్‌లో బలమైన ఫీచర్లు, అధితమైన కెమెరాతో వస్తున్నాయి. ఈ క్రమంలో రూ.7000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న టాప్-3 స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

Samsung Galaxy M05

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, దక్షిణ కొరియా టెక్ కంపెనీ శామ్సంగ్ నుండి వచ్చిన ఈ M-సిరీస్ ఫోన్ 6.7-అంగుళాల HD + డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ పరికరం 5000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్‌ చేస్తుంది. దీనికి 50MP కెమెరా సెటప్ ఉంది. కస్టమర్లు ఈ ఫోన్ అమెజాన్‌ ఇండియాలో రూ.6,499 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Also Read: Samsung Galaxy A07 4G: రూ.7500 ధరతో శామ్సంగ్ నయా ఫోన్ లాంచ్.. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా..!

Realme Narzo 80 Lite 4G

ఈ పరికరం అమెజాన్‌లో రూ. 7,299 ధరకు జాబితా చేయబడింది. ఆఫర్‌ లో భాగంగా, దీనిని రూ. 7000 కి దగ్గరగా ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, దీనికి IP54 దుమ్ము మర నీటి నిరోధకత ఉంది. దీని మందం కేవలం 7.94 అంగుళాలు. 13MP కెమెరా కలిగిన ఫోన్ 6300mAh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంటుంది.

Lava Bold N1 Pro

ఈ స్మార్ట్‌ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో బిగ్ 6.67-అంగుళాల డిస్‌ప్లేను అందించారు. వెనుక ప్యానెల్‌లో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం..8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీని 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఇది అమెజాన్‌లో రూ. 6,798 కి లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad