Smart phones under 25k: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీలు మార్కెట్లోకి అనేక కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. వీటిలో బడ్జెట్ ఫ్రెండ్లీ, మిడ్ రేంజ్ నుండి ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ వరకు ఫోన్‌లు ఉన్నాయి. మీరు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా..? అయితే, మీ బడ్జెట్ 15 వేల కంటే తక్కువ లేదా రూ. 25 వేల వరకు ఉంటే మార్కెట్లో కొత్త ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మనం రూ. 25 వేల ధరలో వస్తున్న కొన్ని ఫోన్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Motorola Edge 60 5G
మీరు గేమింగ్, కెమెరా ఫ్రెండ్లీ ఫోన్ కొనాలనుకుంటే మోటరోలా ఎడ్జ్ 60 5Gని ఎంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా – 50MP + 50MP + 10MP ఉంది. అయితే, ముందు భాగంలో 50MP ముందు కెమెరా ఉంది. ఫోన్‌లో 5500 mAh బ్యాటరీ, డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 25,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే, బ్యాంక్ కార్డ్ లేదా ఇతర ఆఫర్‌ల ద్వారా ఇంకా తక్కువ ధరకు దీన్ని కొనుగోలు చేయవచ్చు.
OPPO K13x 5G
ఒప్పో K13x 5G 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 12,999గా ఉంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. స్టోరేజ్‌ను 2 TB వరకు పెంచవచ్చు. ఇందులో 50MP + 2MP డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. అయితే, ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీ తో వస్తుంది. ఇది డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
Infinix GT 30 Pro 5G+
ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G ఫోన్ రూ. 25000 కంటే తక్కువ ధరకు గొప్ప ఫీచర్లతో వస్తుంది. దీని 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ను కేవలం రూ. 24,999గా ఉంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా – 108MP + 8MP ఉంది. అయితే, ముందు భాగంలో 13MP ముందు కెమెరా ఉంది. ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీని కలిగి ఉంది.ఈ ఫోన్ లో డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంది.
Tecno Pova Curve 5G
టెక్నో పోవా కర్వ్ 5G 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో ఫ్రంట్ కాల్స్ కోసం..ఇందులో 13MP కెమెరా అందుబాటులో ఉంది. అయితే, వెనుక భాగంలో 64-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనికి డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంది.