Friday, December 12, 2025
Homeటెక్నాలజీBest 5G Smartphones: కేవలం రూ.15 వేల బడ్జెట్‌లో ఐఫోన్‌ను తలదన్నే ఫీచర్లు.. వెంటనే కొనేయండి...

Best 5G Smartphones: కేవలం రూ.15 వేల బడ్జెట్‌లో ఐఫోన్‌ను తలదన్నే ఫీచర్లు.. వెంటనే కొనేయండి బాసూ..!

Best Budget 5G Smartphones under 15k Price: భారత మార్కెట్‌లో బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్లకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్లను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. యూజర్ల అవసరానికి అనుగుణంగా అన్ని మొబైల్‌ తయారీ సంస్థలు బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నాయి. ఈ సెగ్మెంట్లలో వరుసగా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేస్తున్నాయి. మొబైల్‌ సంస్థల మధ్య నెలకొన్ని పోటీతో ప్రస్తుతం 5జీ ఫోన్లు తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. కేవలం రూ.15 వేల బడ్జెట్‌లోనే క్రేజీ ఫీచర్లతో 5G స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. పవర్ ఫుల్ బ్యాటరీతో పాటు అద్భుతమైన ఫీచర్లు, బిగ్ డిస్‌ప్లే, బెస్ట్ కెమెరాను అందించే ఐదు బెస్ట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్లపై ఓలుక్కేద్దాం.

- Advertisement -

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం36 5జీ

బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేయడంలో శామ్‌సంగ్‌ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం శామ్‌సంగ్ గెలాక్సీ ఎం36 5జీ రూ.12,499 ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ హ్యండ్ సెట్ 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్‌ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఎక్సినోస్‌ చిప్‌సెట్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. శామ్‌సంగ్ నుంచి పవర్‌ఫుల్‌ 5జీ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మోటరోలా జీ45 5జీ

ప్రస్తుతం రూ.9,999 ధర వద్ద లభిస్తున్న ఈ మోటరోలా ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ 5000mAh బ్యాటరీ, 6.5 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్ప్లేతో వస్తుంది.

వివో Y31 5G

వివో Y31 5G స్మార్ట్‌ఫోన్‌ రూ. 14,999 ధర వద్ద అందుబాటులో ఉంది. 6.68 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ 1000 నిట్స్‌ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇది 50 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

ఐక్యూ జెడ్‌10 ఎక్స్‌ 5జీ

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రూ. 13,998 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ 7300 చిప్‌సెట్, 6,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 6.72 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

రియల్‌మీ పి3 ఎక్స్ 5జి

రియల్‌మీ పి3 ఎక్స్ 5జి స్మార్ట్‌ఫోన్‌ రూ. 11,499 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 6,000mAh బ్యాటరీతో వస్తుంది. మెరుగైన 5జీ కనెక్టివిటీ, పనితీరును కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News