Samsung Galaxy F05 Discount: చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అమెజాన్‌లో శామ్‌సంగ్ ఫోన్‌లపై ఉత్తమ డీల్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో కొనసాగుతున్న సేల్ సమయంలో శామ్‌సంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌పై గొప్ప డీల్ అందుబాటులో ఉంది. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుతం అమెజాన్ నుండి రూ.6000 కంటే తక్కువ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న డీల్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Samsung Galaxy F05 ఆఫర్:
శామ్‌సంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.6549 (4GB + 64GB) ధరకు లిస్ట్ అయింది. ఈ ఫోన్‌పై, కంపెనీ వివిధ బ్యాంక్ కార్డులపై రూ.654 బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఫోన్ ధర రూ.5895కి తగ్గుతుంది. దీనితో పాటు, పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే అదనపు డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. అయితే, ఇది పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
Also Read: Buds vs Headphones: బడ్స్ వాడితే మంచిదా? లేక హెడ్ ఫోన్స్ వాడితే మంచిదా?
Samsung Galaxy F05 ఫీచర్లు:
శామ్‌సంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ పరికరం మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ ను అమర్చారు. 4GB RAM ఉన్న ఈ ఫోన్‌లో వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీని సహాయంతో RAMని 4GB పెంచవచ్చు. దీని ద్వారా మొత్తం RAMని 8GB చేయవచ్చు. దీనితో పాటు, స్టోరేజ్ కోసం 64 GB అందుబాటులో ఉంది. ఇక కేమెరా విషయానికి వస్తే.. ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీనికి 2MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..శామ్‌సంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


