Saturday, November 15, 2025
Homeటెక్నాలజీJio: అపరిమిత వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ 5జీ..ఈ జియో రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసా..?

Jio: అపరిమిత వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ 5జీ..ఈ జియో రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసా..?

Jio Recharge Plans: రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్. ప్రతిరోజూ లక్షలాది మంది వినియోగదారులు దీని వేగవంతమైన ఇంటర్నెట్, సరసమైన ప్లాన్‌లను సద్వినియోగం చేసుకుంటున్నారు. కంపెనీ అన్ని రకాల కస్టమర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది. వీటిలో దీర్ఘకాలిక చెల్లుబాటు, రోజువారీ డేటా, ఉచిత SMS, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రయోజనాల ఉన్నాయి.

- Advertisement -

అయితే, రూ.1000 కంటే తక్కువ ధరకు దీర్ఘకాలిక రీఛార్జ్ కొనుగోలు చేయాలనీ చూస్తుంటే, జియో రెండు ప్రత్యేక ప్లాన్‌లు ఉత్తమ ఎంపిక కావొచ్చు. అందులో రూ. 949 రీఛార్జ్ ప్లాన్, రూ. 999 రీఛార్జ్ ప్లాన్. ఈ రెండు జియో రీఛార్జ్ ప్లాన్లు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSల ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ ప్లాన్లలో చెల్లుబాటు, అదనపు ప్రయోజనాలలో మాత్రమే తేడా ఉంది. ఇప్పుడు ఏ ప్లాన్‌ ప్రయోజనకరంగా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.

జియో రూ. 999 రీఛార్జ్ ప్లాన్

ఈ జియో రీఛార్జ్ ప్లాన్ 98 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది మూడు నెలల కంటే కొంచెం ఎక్కువ కాలం కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ ప్లాన్ లో రోజుకు 2GB డేటాను ఆనందించవచ్చు. అంటే ఈ ప్లాన్ లో మొత్తం 196GB డేటాను పొందొచ్చు. అంతేకాకుండా, ఈ ప్లాన్‌లో మొత్తం 98 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను పొందొచ్చు. 5G పరికరం ఉన్న వినియోగదారులు 5G పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఉంటే ఈ ప్లాన్ అపరిమిత 5G డేటా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో యాప్‌లను కూడా ఉపయోగించవచ్చు. అలాగే, జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో మూడు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.

Also Read: Annual Recharge Plans: ఒక రీఛార్జ్‌తో 365 రోజుల వ్యాలిడిటీ!

జియో రూ. 949 రీఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్లాన్ లో 2GB డేటాను ఆస్వాదించవచ్చు. అంటే ఈ ప్లాన్ లో మొత్తం 168GB డేటాను పొందొచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో, డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 84 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. 5G పరికరం ఉన్న వినియోగదారులు 5G పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఉంటే ఈ ప్లాన్ అపరిమిత 5G డేటా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో యాప్‌లను కూడా ఉపయోగించవచ్చు.

ఈ రెండు ప్లాన్ల మధ్య తేడా ఏమిటి?

రిలయన్స్ జియో రూ.949, రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌లు రెండూ 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే, రెండు ప్లాన్‌లు డిస్నీ + హాట్‌స్టార్ ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తాయి. తేడా వాటి చెల్లుబాటు, అదనపు ప్రయోజనాలలో ఉంది. జియో రూ. 949 రీఛార్జ్ ప్లాన్‌లో 84 రోజుల సర్వీస్ చెల్లుబాటు ఉంది. మరోవైపు, రూ. 50 ఎక్కువ ఖర్చు చేస్తే రూ. 999 రీఛార్జ్ ప్లాన్‌ కొనుగోలు చేయొచ్చు. దీని ద్వారా 14 రోజుల అదనపు చెల్లుబాటును పొందొచ్చు. దానితో పాటు 28GB అదనపు డేటా కూడా లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad