LED TVs under 12k: సరసమైన ధరకు అదిరిపోయే ఫీచర్స్ తో కూడిన LED టీవీ కోసం చూస్తున్నట్లయితే..ఈ వార్త మీకోసమే. అమెజాన్ ఇండియాలో మూడు బ్రాండెడ్ టీవీలు తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. కేవలం రూ.12,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండటం విశేషం. వీటిలో అత్యుత్తమ డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన డాల్బీ సౌండ్‌ను కూడా పొందొచ్చు.ఈ జాబితాలో రెడ్‌మి టీవీ కూడా ఉంది. ప్రత్యేకత ఏమిటంటే? ఈ టీవీలను కొన్ని ఉత్తమ ఆఫర్‌లతో కూడా కొనుగోలు చేయవచ్చు.
Redmi Xiaomi 80 cm (32 అంగుళాలు) F సిరీస్ HD రెడీ స్మార్ట్ LED ఫైర్ టీవీ L32MA-FVIN (బ్లాక్)
అమెజాన్ ఇండియాలో ఈ టీవీ ధర రూ. 11,499కి అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ టీవీపై రూ. 344 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా దీని ధరను రూ. 2,830 వరకు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ పాత టీవీ పరిస్థితి, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ టీవీ HD రెడీ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో డాల్బీ ఆడియోను కూడా పొందొచ్చు.
Xiaomi MI స్మార్ట్ టీవీ A 80 cm (32) HD రెడీ స్మార్ట్ గూగుల్ LED టీవీ L32MA-AIN (బ్లాక్)
అమెజాన్ ఇండియాలో ఈ Xiaomi టీవీ రూ. 11990కే కొనుగోలు చేయొచ్చు. ఈ టీవీపై రూ. 359 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా దాదాపు రూ. 2830 వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ పాత టీవీ కండిషన్, బ్రాండ్, ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే..ఈ Xiaomi టీవీలో HD రెడీ డిస్ప్లే ఉంది. ఈ టీవీ 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఇది డాల్బీ ఆడియోకు మద్దతు ఇస్తుంది.
VW 80 cm (32 అంగుళాలు) ప్లేవాల్ ఫ్రేమ్‌లెస్ సిరీస్ HD రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV VW32F5 (బ్లాక్)
అమెజాన్ ఇండియాలో ఈ టీవీ ధర రూ. 7,999. ఇది బ్యాంక్ ఆఫర్‌లో 10% వరకు చౌకగా ఉంటుంది. ఈ టీవీపై రూ. 239 వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది. దీన్ని రూ. 2830 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ పాత టీవీ కండిషన్, బ్రాండ్, ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఫీచర్ల చూస్తే..ఈ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్, 24 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో డిస్ప్లేను పొందొచ్చు.