Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSmart Phones: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలా..? రూ. 20 వేల లోపు లభించే ఈ...

Smart Phones: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలా..? రూ. 20 వేల లోపు లభించే ఈ మోటరోలా స్మార్ట్ ఫోన్లు చూడండి..

Motorola Smart Phones: మీరు కెమెరా, పనితీరు, ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం కొనాలని చూస్తున్నట్లయితే, ఈ వార్త మీకోసమే! మోటరోలా తాజా స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన ఫీచర్ల తో ఉత్తమ ఎంపికలుగా ఉన్నాయి. ఇవి 32MP సెల్ఫీ కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ, IP68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ కలిగి ఉన్నాయి. ఈ మోటరోలా ఫోన్‌ల ప్రత్యేకత ఏమిటంటే? ఇవి రూ.20,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు ఉండటం విశేషం. ఈ జాబితాలలో మోటరోలా G96 5G, మోటరోలా G86 పవర్ 5G, మోటరోలా G85 5G, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వంటి పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు వీటి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

మోటరోలా G86 పవర్ 5G:

బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులకు మోటరోలా G86 పవర్ 5G ఉత్తమ ఎంపిక. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే 6.7-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అమర్చారు. దీని ప్రత్యేకత ఏంటంటే? 6720mAh బ్యాటరీ. ఇందులో కెమెరాలో 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. కాగా, ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,999 కు కొనుగోలు చేయొచ్చు.

Also Read: YouTube: మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా..? ఈ టిప్స్ పాటిస్తే మస్తు వ్యూస్..!

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్:

ఈ పరికరం ఇది 6.67-అంగుళాల పో లెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇది దీని చాలా శక్తివంతమైనదిగా చేస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP OIS ప్రైమరీ లెన్స్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 5000mAh బ్యాటరీతో ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో రూ. 18,999 కు సొంతం చేసుకోవచ్చు.

మోటరోలా G85 5G:

ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో బెస్ట్ ఆప్షన్. అతి భారీ తగ్గింపుతో ఇది కేవలం రూ. 15,999 కే అందుబాటులో ఉంది. ఈ పరికరం 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.6-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ఉంది. కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. ఫోన్‌కు శక్తినివ్వడానికి 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీ ఉంది.

మోటరోలా G96 5G:

ఈ మోటోరోలా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 6.6-అంగుళాల FHD+ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లేలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై నడుస్తుంది. కెమెరా గురించిమాట్లాడితే, దీనికి 50MP OIS ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. పవర్ కోసం దీనికి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,999కి కొనుగోలు చేయొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad