Samsung galaxy S24 FE: దక్షిణ కొరియా టెక్ బ్రాండ్ శామ్సంగ్ ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ S24 FE 5G గొప్ప డీల్‌ను అందిస్తోంది. దీని ఇప్పుడు సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ పరికరం అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధర ఉండటం వల్ల 2025లో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఇది గెలాక్సీ ఏఐ ఫీచర్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుండి దాదాపు రూ.30,000కి ఆర్డర్ చేయవచ్చు. మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం.. కస్టమర్లు రూ.50,000 నుండి రూ.70,000 ధరల విభాగంలో అత్యధికంగా కొనుగోలు చేసిన ఫోన్ ఇది. ఫ్యాన్ ఎడిషన్ మోడల్ మార్కెట్లో రూ.59,999కి లాంచ్ అయింది. డిస్కౌంట్ల తర్వాత దీని ధర దాదాపు రూ.30,000కి తగ్గింది.
శామ్సంగ్ గెలాక్సీ S24 FE 5G తగ్గింపు:
శామ్సంగ్ గెలాక్సీ S24 FE 5G ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.30,999 తగ్గింపు ధరకు లిస్ట్ అయింది. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లింపులు చేస్తే, 10 శాతం వరకు తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. దీని వలన ఫోన్ ధర దాదాపు రూ.30,000 లేదా అంతకంటే తక్కువకు తగ్గుతుంది. అంతేకాకుండా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో రూ.23,700 వరకు గరిష్ట ఎక్స్ఛేంజ్ తగ్గింపును పొందవచ్చు. కాకపోతే ఎక్స్ఛేంజ్ వాల్యూ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. ఈ ఫోన్ బ్లూ, గ్రాఫైట్, మింట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
శామ్సంగ్ గెలాక్సీ S24 FE 5G ఫీచర్లు:
ఫీచర్ల విషయానికి వస్తే..శామ్సంగ్ గెలాక్సీ S24 FE 5G ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. శక్తివంతమైన పనితీరు కోసం ఎక్సినోస్ 2400e ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 10MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 4700mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్యాక్ చేస్తుంది.


