SmartPhones Under 20K: దేశంలో పండగ సీజన్ ప్రారంభమైంది.ఈ సందర్బంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గృహోపకరణాల నుండి స్మార్ట్‌ఫోన్‌ల వరకు ప్రతిదానిపై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగానే స్మార్ట్‌ఫోన్‌లపై కూడా బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు చాలా రోజుల నుంచి రూ.20వేల బడ్జెట్ లోపు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటే, ఇదే మీకు సరైన అవకాశం. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో రూ.20 వేల లోపు లభించే స్మార్ట్ ఫోన్ల లిస్ట్ గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
OPPO K13
మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ చూస్తుంటే, ఒప్పో K13 సరైనది. ఈ పరికరం 7,000mAh బడా బ్యాటరీతో వస్తుంది.దీని సులభంగా రెండు రోజులు చార్జిన్గ్ పెట్టకుండా వాడవచ్చు. దీని 80W సూపర్‌ఫాస్ట్ ఛార్జర్ నిమిషాల్లో ఛార్జ్ చేస్తుంది. ఇంకా దీని 120Hz అమోలేడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ దీనిని శక్తివంతమైన ఆల్ రౌండర్‌గా చేస్తాయి.
iQOO Z9s 5G
ప్రతి విభాగంలోనూ బాగా పనిచేసే ఫోన్ కావాలనుకుంటే, ఐక్యూ ఒక గొప్ప ఎంపిక అవుతుంది. ఇది కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ, పనితీరు పరంగా అద్భుతంగా ఉంటుంది. గేమింగ్ నుండి ఫోటోగ్రఫీ వరకు ఈ పరికరం డిస్సపాయింట్ చేయదు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ, 7300 ప్రాసెసర్, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది.
Motorola Moto G85 5G
మోటోరోలా ఫోన్లు వాటి క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవానికి ప్రసిద్ధి చెందాయి.మోటో G85 5G ఈ ధర పరిధిలో బలమైన పనితీరు, అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఇవి దీని గొప్ప ఎంపికగా చేస్తాయి. ఈ మోటో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్, 50MP + 8MP కెమెరాలు, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తాయి.
Samsung Galaxy M35 5G
మీరు శామ్‌సంగ్ లవర్ అయితే గెలాక్సీ M35 5G మంచి ఆల్ రౌండర్ అవుతుంది. దీని బిగ్ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్ప్లే మల్టీమీడియా ప్రియులకు ఇది ఒక గొప్ప పరికరం. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది.
Realme P3
తక్కువ ధరకు అధిక ఫీచర్ల ఉన్న ఫోన్ చూస్తుంటే, ఈ రియల్‌మి బెస్ట్ ఆప్షన్. ఈ పరికరం 6.67-అంగుళాల FHD+అమోలేడ్ 120Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 256GB నిల్వను కలిగి ఉంది.


