Best SmartPhones Mid Range SmartPhones Under 20k: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. కొత్త కొత్త ఫోన్లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లకు భారత్ మంచి మార్కెటింగ్ ప్లేస్‌గా చెప్పవచ్చు. అందుకే అన్ని కంపెనీలు మిడ్‌రేంజ్ ఫోన్లపై దృష్టి పెట్టాయి. మీరు కూడా కేవలం రూ.20వేల లోపు ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని చూస్తున్నట్లైతే మార్కెట్‌లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై లుక్కేయండి.
రూ. 20 వేలలోపు స్మార్ట్‌ఫోన్లు
రియల్‌మీ 13 ప్లస్ 5జీ
రియల్‌మీ 13 ప్లస్ 5జీ మొబైల్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18,998 ధర వద్ద లభిస్తుంది. ఇది 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కూడిన 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఐఓఎస్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈఐఎస్ సపోర్ట్‌తో కూడిన 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అమెజాన్‌లో ప్రస్తుతం రూ.16,999 ధర వద్ద అందుబాటులో ఉంది. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ. 1,000 వరకు) పొందవచ్చు.
వివో వై31 ప్రో 5జీ
వివో వై31 ప్రో 5జీ 6.72-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2408×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 nits వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 4nm ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 6500mAh బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా వంటివి ఉన్నాయి. సెల్ఫీల కోసం ప్రత్యే్ంగా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. విజయ్ సేల్స్‌లో 8 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 17,999 ధర వద్ద అందుబాటులో ఉంది. దీనిపై రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఏ17 5జీ
శామ్‌సంగ్ గెలాక్సీ ఏ17 5జీ మొబైల్ 1080×2340 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ యూ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంద. ఈ ఫోన్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీనిలో ఆటోఫోకస్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉంటాయి. వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించింది. శామ్‌సంగ్ గెలాక్సీ A17 5జీ.. 6జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ శామ్‌సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రూ.18,999 వద్ద లభిస్తుంది.
ఐక్యూ జెడ్10ఆర్ 5G
ఐక్యూ జెడ్10ఆర్ 5G మొబైల్ 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 4nm ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5700mAh బ్యాటరీతో వస్తుంది. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఐక్యూ Z10R 5G అమెజాన్‌లో రూ.19,498 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.


