Best Smartphones under 15 thousand: పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కొత్త వస్తువులు కొనేందుకు అంతా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే అదనుగా పలు ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తుంటాయి. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. మీరు ఈ సేల్‌లో రూ. 15 వేలలోపు ఓ బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే.. వీటిపై ఓ లుక్కేయండి.
రెడ్‌మీ ఏ4 5జీ
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మీ నుంచి రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్ అతి సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్లతో రిలీజైంది. ఈ ఫోన్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్‌లో కేవలం రూ.7,499 వద్ద లభిస్తోంది. ఇది మార్కెట్లోని అత్యంత సరసమైన 5జీ-రెడీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఇది మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది.
రియల్‌మి నార్జో 80 లైట్
అమెజాన్‌లో రూ. 8,999 ధరకు లభించే ఈ ఫోన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.
లావా స్టార్మ్ ప్లే 5జీ
అమెజాన్‌లో రూ.8,999 ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. ఈ విభాగంలోని ఇతర ఫోన్‌లతో పోలిస్తే వేగవంతమైన పనితీరును అందిస్తుంది. డిస్‌ప్లే, కెమెరా విషయంలో ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.
ఐక్యూ జెడ్10 లైట్ 5జీ
ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ. 8,999 ధర వద్ద లభిస్తోంది. దీన్ని లేటెస్ట్ డిజైన్‌తో రూపొందించారు. గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి వాటికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు.
ఒప్పో కే13ఎక్స్
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,499 ధరకు లభించే.. ఒప్పో కే13ఎక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. దీనిలో బెస్ట్ కెమెరా, బ్యాటరీ లైఫ్‌ను అందించింది. స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది.
పోకో ఎం7 ప్లస్
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999 ధరకు లభించే పోకో ఎం7 ప్లస్.. స్మూత్ పెర్ఫార్మెన్స్ కలిగి ఉంటుంది. దీనిలో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని అందించింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ గేమింగ్ ప్రియులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒప్పో కే13
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999 వద్ద ఉన్న ఒప్పో కే13 స్టైలిష్ మిడ్-రేంజ్ ఫోన్. ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ కలిగి ఉంటుంది. దీనిలో ప్రీమియం కెమెరా ఫీచర్లను అందించింది. బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది.
వివో టీ4ఎక్స్
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,249 కు లభించే వివో టీ4ఎక్స్ బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ స్మార్ట్‌ఫోన్. ఇది మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది.
ఐక్యూఓ జెడ్10 ఎక్స్
అమెజాన్‌లో రూ.11,999 ధరకు లభించే ఈ స్మార్ట్‌ఫోన్.. గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి వాటికి ఉపయోగకరంగా ఉంటుంది. రూ. 15 వేల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు.
రియల్‌మి పీ4 & సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో
రియల్‌మి పీ4, సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో రెండు ఫోన్లలోనూ బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందించారు. రియల్‌మే పీ4 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999 ధర వద్ద, సీఎమ్‌ఎఫ్ నథింగ్ ఫోన్ 2 నూ. 15,999 ధర వద్ద లభిస్తుంది. ఈ రెండు ఫోన్లూ లేటెస్ట్ డిజైన్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి. కాగా సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో మంచి హార్డ్‌వేర్‌తో మినిమలిస్టిక్ స్టైలింగ్‌తో రూపొందింది. దీని లుక్ స్టైలిష్‌గా ప్రీమియం రేంజ్‌లో ఉంటుంది.


