Best SmartPhones Under 25k Price in Indian Market: భారత మార్కెట్‌లో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. తక్కువ ధరలోనే ప్రీమియం ఫోన్లకు ఏమాత్రం తగ్గని ఫీచర్లను ఇందులో అందిస్తున్నాయి స్మార్ట్‌పోన్ కంపెనీలు. మీరు రూ.25 వేలలోపు ఒక మంచి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లైతే.. ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. మార్కెట్‌లో అద్భుతమైన ఫీచర్లు గల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ, పోకో, వివో, నథింగ్, వన్‌ప్లస్ వంటి కంపెనీలు మిడ్-రేంజ్‌లో అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఆ స్మార్ట్‌పోన్లపై ఓలుక్కేద్దాం.
రియల్‌మీ P4 ప్రో 5G
రియల్‌మీ P4 ప్రో 5Gలోని 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.23,999 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1280×2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 7,000mAh బ్యాటరీని ఇందులో అందించారు.
వివో వై400 5G
వివో వై400 5జీలోని 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.21,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలను చేర్చింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 5జీ
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 5జీలోని 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999 ధర వద్ద లభిస్తోంది. ఇది 6.77 అంగుళాల OLED డిస్‌ప్లేను 2392×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఓఐఎస్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 80W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 7,100mAh బ్యాటరీని అందించారు.
నథింగ్ ఫోన్ 3ఎ
నథింగ్ ఫోన్ 3ఎలోని 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.24,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 1080×2392 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కూడిన 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ డిజిటల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. దీని ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు గల 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
పోకో ఎక్స్ 7 ప్రో 5జీ
పోకో ఎక్స్ 7 ప్రో 5జీలోని 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.21,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్షిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఓఐఎస్ సపోర్ట్‌తో కూడన 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీనిలో 90W హైపర్‌ఛార్జ్ సపోర్ట గల 6,550mAh బ్యాటరీ అందించింది.


