Smartphones with 108mp: ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు ఎక్కువ మెగాపిక్సెల్ కెమెరాలను అందించే ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు. ఇదే సమయంలో సరసమైన ధరలో ఉత్తమ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తే మార్కెట్లో 3 బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ల ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. ప్రత్యేక విషయం ఏంటంటే? ఈ ఫోన్ల ధర రూ.15వేల లోపు ఉంటుంది. ఈ ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Redmi 13 5G
ఈ స్మార్ట్‌ఫోన్ 6GBRAM+128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.13,999. కానీ, అమెజాన్ ఇండియాలో పరిమిత కాల అమ్మకంలో ఈ ఫోన్ రూ.11,499 కు లిస్ట్ అయింది. దీని కొనుగోలుపై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇది ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌ల కింద కొనుగోలు చేస్తే, రూ.750 అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD + డిస్‌ప్లేను అందించారు. ఇది స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ రెండింటికీ గొప్పది. కెమెరా గురించి చెప్పాలంటే,రెడ్ మీ 13 5Gలో 108MP ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది గొప్ప ఫోటో, వీడియో నాణ్యతను అందిస్తుంది. ఈ ఫోన్‌లో బిగ్ 5000mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
Tecno Pova 6 Neo 5G
ఈ పరికరం 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 12,999. కానీ ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.11,999 కు అందుబాటులో ఉంది. దీనితో పాటు, కస్టమర్లు ఈ సేల్‌లో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా పొందొచ్చు. ఇది దాని ధరను మరింత తగ్గిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఇది 6.67-అంగుళాల FHD+అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, స్మూత్ టచ్ రెస్పాన్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. కెమెరా గురించి చెప్పాలంటే, ఇది 108MP AI ప్రైమరీ కెమెరా, సెకండరీ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. అయితే ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. దీని అతిపెద్ద ఫీచర్ 5000mAh బ్యాటరీ. ఇది దీర్ఘకాలిక బ్యాకప్‌ను అందిస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
POCO M6 Plus 5G
ఈ పోకో ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కి అమ్ముడవుతోంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. పనితీరు పరంగా, ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై నడుస్తుంది. కెమెరా విభాగంలో 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. పవర్ కోసం ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


