దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్లను ప్రకటించింది. సంస్థ ఫౌండర్, సీఎండి ఎం. బాలు చౌదరి ఈ ఆఫర్ల వివరాలు వెల్లడించారు.
22 ఏళ్ల బిగ్ సీ
తాము బిగ్ సి ప్రారంభించి 22 వసంతాలు పూర్తయ్యాయని, ఆరంభించిన అనతి కాలంలోనే బిగ్ ‘సి’ మొబైల్ ఫోన్లకు సంబంధించిన ప్రతి రంగంలోనూ నెంబర్ వన్ స్థానానికి ఎదిగిందని ఆయన తెలిపారు. ప్రతి పండుగను, ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడం తమ బిగ్ సి ఆనవాయితీ అని, ఈ 22వ వార్షికోత్సవం సందర్భంగా కూడా వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.5,999/- విలువ గల స్మార్ట్ వాచ్ లేదా రూ. 1,799/- విలువ గల ఇయర్ బర్డ్స్ ను కేవలం రూ. 22/- కే అందిస్తామని ఆయన తెలిపారు. దీంతోపాటు 10% వరకు తక్షణ క్యాష్ బ్యాక్, మొబైల్ కొనుగోలు కొరకు జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తున్నామని ఆయన వివరించారు. ఇవి మాత్రమే కాక ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక ఖచ్చితమైన బహుమతిని కూడా అందిస్తామని ఆయన తెలిపారు.
క్రింద పేర్కొన్న ఆఫర్లు కూడా
అసలు మొబైల్ అంటేనే బిగ్ సీ అనేలా తమ సంస్థ ప్రస్థానం సాగుతోందన్న ఆయన, వీవో, ఒప్పో, రియల్ మీ, వన్ ప్లస్ పై 10 శాతం వరకు, స్యాంసంగ్ మొబైల్స్ కొనుగోలుపై రూ. 20,000/- వరకు తక్షణ క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు వివరించారు. ఐ ఫోన్ కొనుగోలుపై రూ. 7000/- వరకు తక్షణ డిస్కౌంట్, బ్రాండెడ్ ఉపకరణాలపై కూడా స్పెష్ యానివర్సరీ డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపారు.
వడ్డీ లేదు, డౌన్ పేమెంట్ లేదు
ఎ.టి.యం కార్డుపై ఎలాంటి వడ్డి, డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్టాప్, ఎయిర్ కండీషనర్ లు కొనుగోలు చేసే ఆకర్షణీయమైన సదుపాయాన్ని కూడా అందజేస్తున్నట్లు తెలిపారు.