Saturday, November 15, 2025
Homeటెక్నాలజీFlipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్ సేల్..శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5G పై...

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్ సేల్..శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5G పై భారీ డిస్కౌంట్.. ఎంతంటే..?

Samsung Galaxy S23 Ultra 5G Discount: కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నవారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న ఫ్రీడమ్ సేల్ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G కూడా చాలా చౌకగా లభిస్తోంది. రూ. 75 వేల బడ్జెట్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ పరికరం కోసం చూస్తున్నట్లయితే, ఈ పరికరం ఉత్తమ ఎంపిక కావచ్చు. ఈ శక్తివంతమైన 5G ఫోన్ పనితీరు పరంగానే కాకుండా..కెమెరా, డిస్ప్లే, డిజైన్ పరంగా అద్భుతంగా ఉంది. ఈ పరికరానికి సంబంధించి ఆఫర్, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

Samsung Galaxy S23 Ultra 5G ఆఫర్‌:

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5G 12GB + 256GB వేరియంట్‌ అసలు ధర రూ. 1,09,999. ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా దీని కేవలం రూ. 78,699కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ పరికరంపై ఏకంగా రూ. 31,141 తగ్గింపు లభిస్తోంది. ఇది మాత్రమే కాదు..ఈ పరికరంపై రూ. 4,000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీనితో పాటు, కస్టమర్ల నెలకు రూ. 3,857 నుండి ప్రారంభమయ్యే సులభమైన EMIలో కూడా కొనుగోలు చేయగల ప్రత్యేక EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ప్రత్యేక విషయం ఏంటంటే..నో కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఇదే సమయంలో మరింత డబ్బు ఆదా చేయడానికి పరికరంపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ విలువ పాత ఫోన్ కండిషన్ బట్టి ఉంటుంది.

Also Read: Upcoming Smartphones: కొత్త ఫోన్ కొనాలా..? అయితే కాస్త ఆగండి..

Samsung Galaxy S23 Ultra 5G స్పెసిఫికేషన్లు:

పరికరంలో 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌, 1,750 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని అందించారు. దీనితో పాటు, ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్‌ను కూడా పొందుతోంది. ఈ పరికరంలో 12GB వరకు RAM, 1TB వరకు నిల్వ అందించారు.

కెమెరా విషయానికి వస్తే..ఫోన్‌లో 200MP ప్రైమరీ లెన్స్‌ను పొందొచ్చు. దీనితో పాటు, 10MP పెరిస్కోప్, 10MP టెలిఫోటో కెమెరా కూడా పరికరంలో అందుబాటులో ఉన్నాయి. ఇదే సమయంలో 12MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం..పరికరంలో 12MP కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad