Saturday, November 15, 2025
Homeటెక్నాలజీBMW: సెకెండ్స్ లో కలర్ మార్చే కారు, ఇంటెలిజెంట్ కంపానియన్ కూడా

BMW: సెకెండ్స్ లో కలర్ మార్చే కారు, ఇంటెలిజెంట్ కంపానియన్ కూడా

కారు కొనేప్పుడు మీకు ఏ కలర్ కారు ఇష్టమంటే కొందరు వైట్, బ్లాక్, రెడ్..ఇలా చెబుతారు.. కానీ కొందరు మాత్రం నాకు అన్ని కలర్స్ ఇష్టం. మరి మల్టీ కలర్ కార్ లేదా కలర్ మార్చే కార్ ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటారు. ఇలాంటి వారి టేస్ట్ పైన ఇంత కాలం పనిచేసింది ప్రముఖ లగ్జరీ కార్స్ కంపెనీ బీఎండబ్ల్యూ. బీఎండబల్యూ ఐ విజన్ డీ కార్ ఏకంగా కనురెప్పపాటులో కారు రంగును మార్చేస్తుంది. మనం చూస్తుండగానే కార్ కలర్స్ ఛేంజ్ అవుతూ పోతాయన్నమాట. ఈ కార్ ను లాస్ వెగాస్ లో జరిగిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించారు. ఈ కొత్త కార్ సరికొత్త ఇంటెలిజెంట్ కంపానియన్ కావటం ఖాయమని బీఎండబ్ల్యూ ఛాలెంజ్ చేస్తోంది. సాఫ్ట్ వేర్-హార్డ్ వేర్ రెండూ కంబైన్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పే ఐ విజన్ డీ కార్ మార్కెట్లో పెద్ద సెన్సేషన్ గా మారింది. వర్చువల్ ఎక్స్ పీరియన్స్ విత్ జిన్యైన్ డ్రైవింగ్ ప్లెజర్ గా ఉండే ఈ ఫ్యూజన్ కార్ ఎవరికైనా ఇట్టే నచ్చేలా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad