Branded SmartPhones Under 20K: కస్టమర్లను ఆకర్షించడానికి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త మోడళ్లను టెక్ మార్కెట్లో లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మీరు చాలా రోజుల నుంచి కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్ న్యూస్! కేవలం రూ.20 వేల లోపు ధరలో మార్కెట్లో అనేక బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. మరి ఆ స్మార్ట్ ఫోన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.20వేల లోపు ధరలో లభించే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు
- Motorola Moto G67 Power 5G
మోటరోలా మోటో G67 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.15,905గా ఉంటె, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999గా లిస్ట్ అయింది.
- డిస్ప్లే: 6.70 అంగుళాలు
- ర్యామ్: 8GB
- స్టోరేజ్: 128GB
- బ్యాటరీ: 7000mAh
- వెనుక కెమెరా: 50MP + 8MP
- ముందు కెమెరా: 32MP
- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7s Gen2
2. Nothing Phone 3a Lite
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 కంటే కొంచెం ఎక్కువ. ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999కి లిస్ట్ అయింది. అయితే, కస్టమర్లు బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌ను కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
- డిస్ప్లే: 6.77 ఇంచ్
- ర్యామ్ : 8GB
- స్టోరేజ్: 128GB
- బ్యాటరీ: 5000mAh
- వెనుక కెమెరా: 50MP + 8MP
- ముందు కెమెరా: 16MP
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో
also read:iQOO 15R: 200MP కెమెరా, 7,600 mAh బ్యాటరీతో ఐక్యూ 15R లాంచ్ డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..?
3. Poco M8 5G
రూ.20 వేల శ్రేణిలో పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ ఉత్తమ ఎంపిక అవుతుంది. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుండి 18,999 రూపాయల ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక దీని ముఖ్య ఫీచర్లు చూస్తే
- డిస్ప్లే: 6.77 అంగుళాలు
- ర్యామ్: 6GB
- స్టోరేజ్: 128GB
- బ్యాటరీ: 5520mAh
- వెనుక కెమెరా: 50MP + 2MP
- ముందు కెమెరా: 20MP
- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3
4. Realme P3 Pro 5G
రియల్‌మీ నుండి వచ్చిన ఈ శక్తివంతమైన ఫోన్ రూ.20 వేల రూపాయల బడ్జెట్‌లో ఉత్తమ ఎంపిక. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో P3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
- డిస్ప్లే: 6.83 అంగుళాలు
- ర్యామ్: 8GB
- స్టోరేజ్: 128GB
- బ్యాటరీ: 6000mAh
- వెనుక కెమెరా: 50MP + 2MP
- ముందు కెమెరా: 16MP
- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7s Gen 3
5. Lava Play Ultra
భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నుండి వచ్చిన లావా ప్లే అల్ట్రా స్మార్ట్‌ఫోన్ రూ.20 వేల శ్రేణిలో ఉత్తమ ఎంపిక అవుతుంది. ఈ లావా ఫోన్‌ను అమెజాన్ నుండి కేవలం రూ.15,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.
- డిస్ప్లే: 6.67 అంగుళాలు
- ర్యామ్: 6GB
- స్టోరేజ్: 128GB
- బ్యాటరీ: 5000mAh
- వెనుక కెమెరా: 64MP + 5MP
- ముందు కెమెరా: 13MP
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300

