BSNL 4G Recharge Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్ధ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఇటీవలే దేశవ్యాప్తంగతా 4G సేవను ప్రారంభించింది. శనివారం (సెప్టెంబర్ 27, 2025)న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 98,000 కంటే ఎక్కువ బీఎస్ఎన్ఎల్ 4G టవర్ల ద్వారా ఈ 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభం తర్వాత ప్రభుత్వ పథకాలు, ఆన్‌లైన్ విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలు, ఉపాధి అవకాశాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. 4జీ సేవలను ప్రారంభించిన సందర్బంగా బీఎస్ఎన్ఎల్ తమ వినియోగారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల కోసం అనేక అద్భుతమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో తక్కువ ధరలతో వచ్చే ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
160 రోజుల వ్యాలిడిటీతో రూ. 997 ప్లాన్..
ఈ ప్రత్యేకమైన బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ను కేవలం రూ. 997 ధర వద్ద ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. తక్కువ ధరలో 160 రోజుల వ్యాలిడిటీని అందిస్తుండటం విశేషం. ఈ ప్లాన్ కింద ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 5 నెలల వరకు మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఉచిత కాలింగ్, ఉచిత ఎస్ఎమ్ఎస్, ప్రతిరోజూ 2 జీబీ డేటా వంటి అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఉచిత కాలింగ్, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు..
బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 997 ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ స్థానిక, ఎస్టీడీ, రోమింగ్ కాల్‌లకు (ముంబై, ఢిల్లీ సర్కిల్‌లతో సహా) వర్తిస్తుంది. యూజర్లు రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్లను కూడా అందుకుంటారు. ఇది మొత్తం రీఛార్జ్ వ్యవధికి అందుబాటులో ఉంటుంది. ఇక, డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. హైస్పీడ్ పరిమితిని చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbpsకి తగ్గిపోతుంది. డేటా పరిమితి అయిపోయిన తర్వాత కూడా బ్రౌజింగ్, మెసేజింగ్ యాప్‌లు పనిచేస్తాయి.
ఈ ప్లాన్తో ఎవికి ప్రయోజనం?
తక్కువ ధరకే ఎక్కువ కాలం చెల్లుబాటు కావాలనుకునే, అన్ని ఫీచర్లను కోరుకునే కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ ఈ ప్రత్యేకమైన ప్లాన్ను ప్రవేశపెట్టింది. తరచుగా రీఛార్జ్‌లు చేయకుండా ఉండి, తమ సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి కూడా ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.


