Saturday, November 15, 2025
HomeTop StoriesCheapest Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఊరమాస్‌ ప్లాన్‌.. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే 11 నెలల పాటు...

Cheapest Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఊరమాస్‌ ప్లాన్‌.. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే 11 నెలల పాటు ఫ్రీ కాల్స్‌, డేటా..!

BSNL Cheapest Annual Recharge Plan Benefits: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఈ మధ్య కాలంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రైవేటు టెలికాం సంస్థలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌కు ధీటుగా తక్కువ ధరలోనే ఎక్కువ బెనిఫిట్స్‌తో కూడిన ప్లాన్లను ప్రవేశపెడుతోంది. తమ కస్టమర్లు జారిపోకుండా, కొత్త కస్టమర్లను ఆకర్షించేలా కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. అంతేకాదు, డేటా స్పీడ్‌ను కూడా అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో రకాలైన సరసమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఇప్పుడు మరొక అద్భుతమైన ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టిన ఓ ప్లాన్‌ చూసి అందరూ అవాక్కవుతున్నారు. తక్కువ ధరలోనే ఎక్కువ వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌ ద్వారా ఉచిత కాలింగ్‌తో పాటు, 24 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్‌ విషయానికి వస్తే.. దీన్ని కేవలం రూ.1,500 కంటే తక్కువకే తీసుకొచ్చింది. ఇది మీ అన్ని రీఛార్జ్ అవసరాలను సులభంగా తీరుస్తుంది. ఈ చవకైన, సరసమైన ప్లాన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

కేవలం రూ.1499 రీఛార్జ్‌తో ఎన్నో ప్రయోజనాలు..

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు రూ.1499 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో దీర్ఘకాలిక వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, డేటాతో సహా ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ ప్లాన్‌ దీర్ఘకాలిక వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. కంపెనీ తన కొత్త రూ.1499 ప్లాన్‌లో దాదాపు 11 నెలల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే, మీరు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 11 నెలల వరకు ఉచిత కాలింగ్‌, అపరిమిత డేటా ప్రయోజనాలు పొందవచ్చు. దీంతో పాటు మీరు భారతదేశంలోని ఏ మూలకైనా మీకు కావలసినన్ని కాల్స్ చేసుకోవచ్చు. అదే సమయంలో మీ ప్రియమైన వారితో గంటల కొద్దీ హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇక, ఈ ప్లాన్‌లో 24జీబీ డేటా కూడా పొందొచ్చు. ఈ డేటాను మీ ఫోన్ ఇంటర్నెట్ అవసరాలకు ఉపయోగించవచ్చు. అంతేకాదు, ఈ లాంటర్మ్‌ వ్యాలిడిటీ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా పొందవచ్చు. ఇలా 11 నెలల పాటు మీరు అన్ని ప్రయోజనాలు పొందుతారు. ఎయిర్ టెల్, జియో వంటి కంపెనీలతో పోల్చుకుంటే.. బీఎస్ఎన్ఎల్ కంపెనీ దీర్ఘకాలిక వ్యాలిడిటీతో తక్కువ ధరలో లభించే బెస్ట్‌ రీఛార్జ్ ప్లాన్ ఇదే అని చెప్పవచ్చు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్ నెలవారీ రీఛార్జ్‌లు చేసుకోవాల్సిన పని లేకుండా.. పదే పదే రీఛార్జ్‌ చేసే ప్రయాసను తీరుస్తుంది. ఇది అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మొత్తం మీద ఈ ప్లాన్ మీ ప్రతి అవసరాన్ని తీర్చే స్మార్ట్ ప్లాన్‌గా చెప్పవచ్చు. మరిన్ని వివరాల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.portal.bsnl.in ను సందర్శించండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad