BSNL Cheapest Recharge Plans for Broadband Users: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) దేశవ్యాప్తంగా ఉన్న తమ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. తన 25 ఏళ్ల కార్యకలాపాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కంపెనీ ‘సిల్వర్ జూబ్లీ FTTH బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్’ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు డేటా, ఓటీటీ, లైవ్ టీవీ ప్రయోజనాలు లభిస్తాయి. ఏకంగా 2500 జీబీ డేటా, 600కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ లభిస్తాయి.
బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీ బ్రాడ్‌బ్రాండ్ ప్లాన్..
బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీ బ్రాడ్‌బ్రాండ్ ప్లాన్ FTTH బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్ కింద ప్రతినెలా రూ.625 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా 70 ఎంబీపీఎస్ వేగంతో 2500 జీబీ వరకు డేటా లభిస్తుంది. ఎఫ్‌యూపీ తర్వాత కూడా ఓటీటీ స్ట్రీమింగ్, బేసిక్ బ్రౌజింగ్‌ను నిర్వహించడానికి ఈ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోతుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 600కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌కు యాక్సెస్ పొందవచ్చు. వాటిలో 127 ప్రీమియం ఛానెల్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఈసారి బీఎస్‌ఎన్‌ఎల్ పెద్ద ఓటీటీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో, వినియోగదారులు ఈ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్, సోనీలైవ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ నుండి వచ్చిన ఈ కొత్త FTTH ఆఫర్ కేవలం డేటా ప్లాన్ మాత్రమే కాకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్, కనెక్టివిటీల మెగా కాంబోగా వస్తోంది. ఎయిర్ ఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ వంటి ప్లాన్లు అధిక ధరకు పరిమిత డేటాను అందిస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం కేవలం రూ.625కు ఓటీటీ ప్లస్ హెవీ డేటా ప్లస్ పూర్తి ప్యాకేజీని అందించడం విశేషం. ఈ అద్భుతమైన ప్లాన్‌తో ఎయిర్‌టెల్, జియో వంటి ప్రైవేటు టెలికాం సంస్థలకు గట్టి పోటీనివ్వనుంది. ఇప్పటికే ప్రైవేటు టెలికాం సంస్థలకు ధీటుగా తక్కువ ధరకే ప్లాన్లను ప్రవేశపెడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్.. తాజాగా, ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో కేవలం రూ. 1కే ప్లాన్‌ను తీసుకొచ్చి సంచలనాన్ని సృష్టించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1 ఫ్రీడమ్ ఆఫర్..
సిల్వర్ జూబ్లీతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా, తన రూ.1 ప్లాన్‌ను కూడా తిరిగి యాక్టివేట్ చేసింది. ఈ ఆఫర్ ప్రస్తుతం కొత్త కస్టమర్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నవంబర్ 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ రూ.1 ప్లాన్‌లో వినియోగదారులు భారీ ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది. ఉచిత జాతీయ రోమింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను అందిస్తోంది.


