Bsnl Special Plan: ప్రైవేట్ టెలికాం కంపెనీలతో బిఎస్ఎన్ఎల్ పోటీపడుతోంది. ఎయిర్టెల్, వోడాఫోన్, జియో తో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు చాలా చవకగా ఉంటాయి. ఈ కారణంతోనే చాలామంది తమ సిమ్ ను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేసుకుంటారు. కస్టమర్లను ఆకర్షించేందుకు బిఎస్ఎన్ఎల్ అనేక బెనిఫిట్స్ తో కొత్త ప్లాన్లను తీసుకువస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ విద్యార్థుల, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్లాన్‌లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు CMD ఏ. రాబర్ట్ జె. రవి తెలిపారు. ఈ ప్రకటనతో పాటు బాలల దినోత్సవం సందర్భంగా కొత్త స్టూడెంట్ స్పెషల్ ప్లాన్లను సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బిఎస్ఎన్ఎల్ స్టూడెంట్ స్పెషల్ ప్లాన్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
బిఎస్ఎన్ఎల్ స్టూడెంట్ స్పెషల్ ప్లాన్ అంటే ఏమిటి?
బిఎస్ఎన్ఎల్ స్టూడెంట్ స్పెషల్ ప్లాన్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పరిమిత కాల ఆఫర్.ఈ ప్లాన్ రోజుకు కేవలం రూ. 8.96 (రూ.251/28 రోజులు)రీఛార్జ్ తో వాయిస్ కాలింగ్, డేటా, SMS సేవలను అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌తో పాటు 100GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ ను నవంబర్ 14 నుండి డిసెంబర్ 13, 2025 వరకు యాక్టివేట్ చేయవచ్చు. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే కాకుండా అందరికి అందుబాటులో ఉండటం ప్రత్యేకత. కస్టమర్లు ఈ ప్లాన్‌ను పొందడానికి సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా లేదా 1800-180-1503 కు కాల్ చేయడం ద్వారా లేదా బిఎస్ఎన్ఎల్ వెబ్ సైట్ కు వెళ్లి ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా డెవలప్ చేసిన అత్యాధునిక క 4G మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ప్లాన్‌ను విడుదల చేసినట్లు CMD తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే తన స్వంత 4G టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్న ఐదవ దేశమని, ఈ టెక్నాలజీని బిఎస్ఎన్ఎల్ చాలా కాలంగా అభివృద్ధి చేసి ఇప్పుడు జాతీయస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

