Sunday, January 18, 2026
Homeటెక్నాలజీBSNL Learners Plan: ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ స్టూడెంట్స్ కోసమే!..100GB డేటా, ఆన్ లిమిటెడ్...

BSNL Learners Plan: ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ స్టూడెంట్స్ కోసమే!..100GB డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్‌..

BSNL: ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ దాని సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లకు ప్రసిద్ధి చెందింది. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే, బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరకు ఎక్కువ డేటా, కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ప్రస్తుతం కంపెనీ మరో గొప్ప ప్లాన్‌ను అందిస్తోంది. అతి తక్కువ ధరకే అపరిమిత కాలింగ్, 100GB డేటాను అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను ప్రత్యేకంగా విద్యార్థుల కోసం తీసుకొచ్చింది. ఒకసారి రీఛార్జ్ చేసిన తర్వాత యూజర్లు దాదాపు 28 రోజుల పాటు డేటాను ఆస్వాదించవచ్చు.

- Advertisement -

బీఎస్ఎన్ఎల్ సరసమైన రూ. 251 లెర్నర్స్ ప్లాన్

ఈ సరసమైన బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ ప్లాన్‌ను ప్రకటించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర రూ.251 మాత్రమే! ఈ స్పెషల్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే యూజర్లు భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ పొందుతారు. ఈ ప్లాన్లో 100GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. అయితే ప్రత్యేకత ఏమిటంటే డేటా వినియోగానికి రోజువారీ లిమిట్ లేదు. రోజుకు 100 SMS బెనిఫిట్స్ పొందవచ్చు. గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే? ఈ ప్రత్యేక ఆఫర్ డిసెంబర్ 13 వరకు చెల్లుబాటు అవుతుంది. కాబట్టి, ఈ ప్లాన్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, డిసెంబర్ 13వ తేదీకి ముందు రీఛార్జ్ చేసుకోవాలి.

also read:Redmi Note 14 Pro Discount: ఈ రెడ్‌మి ఫోన్ పై బిగ్ డిస్కౌంట్..ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే రూ.వేలల్లో డిస్కౌంట్!

జియో ప్లాన్ కంటే సరసమైనది

బీఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన ఈ ప్లాన్‌తో పోలిస్తే, జియో 28-రోజుల వాలిడిటీ ప్లాన్ చాలా ఖరీదైనది. జియో రూ. 349 రీఛార్జ్ ప్లాన్లో 28 రోజుల వాలిడిటీ ప్లాన్‌ లభిస్తుంది. ఇది మొత్తం 56GB డేటా, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అపరిమిత కాలింగ్‌ను సైతం అందిస్తుంది. ఈ ప్లాన్‌లో గూగుల్ జెమిని ప్రో ప్లాన్, 18 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉన్నాయి.

బీఎస్ఎన్ఎల్ రూ.1 ఫ్రీడమ్ ప్లాన్

యూజర్ల నుంచి భారీగా డిమాండ్ రావడంతో బీఎస్ఎన్ఎల్ కంపెనీ పాపులర్ రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. కాగా, ఈ ఆఫర్‌లో 30 రోజుల పాటు అపరిమిత కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News