BSNL best plan: దేశీయ టెలికాం కంపెనీల డేటా ప్లాన్ లు సామాన్యుడు భరించలేని స్థితి వచ్చింది. ప్రైవేటు టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తూ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) బంపర్ ఆఫర్ ను అందిస్తోంది. BSNL పోర్ట్‌ఫోలియోలో సరికొత్త 600 GB డేటా రీఛార్జ్ ప్లాన్ ను అందిస్తోంది. దీనితో పాటు వినియోగదారులు ఈ ప్లాన్‌లో అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న ఏకైక కంపెనీ BSNL రూ. 1,999 ధరలో అద్భుతమైన ప్లాన్ ను అందిస్తోంది. ఇది కంపెనీ దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్, ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీనితో వస్తుంది. అంటే ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పొడవునా ఉచితంగా పొందవచ్చు.
BSNL Q-5G ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే మీరు దీన్ని ఎటువంటి సిమ్, కేబుల్ ఇబ్బంది లేకుండా ఉపయోగించుకునే వీలుంది. అంటే SIM కార్డ్ లేదా ఇంట్లో కేబుల్ ఇబ్బంది అవసరం లేదు. కానీ ఈ సమయంలో కంపెనీ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 365 రోజుల వ్యాలిడిటీ, 600 GB డేటా ఇస్తోంది. అయితే, డేటా అయిపోయిన తర్వాత, మీ ఇంటర్నెట్ వేగం 40kbpsకి తగ్గించబడుతుంది. ఇంటర్నెట్ పూర్తిగా ఆపివేయబడదు కానీ వేగం నెమ్మదిగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో మీరు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. మీరు ఏడాది పొడవునా మాట్లాడవచ్చు.
ఈ ప్లాన్‌లో ఉచితంగా 100 SMSలను పొందుతారు. BSNL ఈ ప్లాన్‌లో మీరు ఉచిత కాలర్ ట్యూన్‌లను ఉపయోగించవచ్చు, Zing యాప్‌ను ఉపయోగించే వంటి కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొత్తంమీద ఈ ప్లాన్ ఇంత తక్కువ ధరకు దీర్ఘకాల చెల్లుబాటుతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
ఈ ప్లాన్ ప్రయోజనాలు
ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా BSNL వినియోగదారులు ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా వారు కోరుకున్నన్ని కాల్స్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ ఏ నంబర్‌కు అయినా పంపడానికి 100 SMS పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 600 GB డేటాను పొందుతారు. డేటా పరిమితి అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 40 kbpsకి తగ్గుతుంది.
ఈ వినియోగదారులకు ఉత్తమ ప్లాన్
ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి.. వాటిలో BSNL వెబ్‌సైట్, BSNL సెల్ఫ్ కేర్ యాప్ లేదా PhonePe, Google Pay వంటి ఆన్‌లైన్ చెల్లింపు యాప్‌ల ద్వారా ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. డేటా, కాలింగ్ సౌకర్యాలు రెండింటినీ అందించే ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తోంది.
బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ధర : ₹1,999
వ్యాలిడిటీని: 365 రోజులు (1 సంవత్సరం)
డేటా: మొత్తం 600 GB హై-స్పీడ్ డేటా (రోజువారీ పరిమితి లేదు)
తర్వాత స్పీడ్: 600 GB తర్వాత వేగం తగ్గి 40 kbpsగా మారుతుంది
కాల్స్: అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్
SMS: ప్రతి రోజు 100 SMSలు
అదనపు లాభాలు: కొన్ని ప్రాంతాల్లో 30 రోజుల Eros Now OTT సబ్‌స్క్రిప్షన్, ఫ్రీ PRBT (Hello Tune) పొందవచ్చు