Saturday, November 15, 2025
Homeటెక్నాలజీBSNL: బీఎస్ఎన్ఎల్‌ బంపర్ ప్లాన్..రూ.485 రీఛార్జ్‌ ప్లాన్‌తో 72 రోజుల వ్యాలిడిటీ..! 

BSNL: బీఎస్ఎన్ఎల్‌ బంపర్ ప్లాన్..రూ.485 రీఛార్జ్‌ ప్లాన్‌తో 72 రోజుల వ్యాలిడిటీ..! 

BSNL Rs.485 Recharge Plan: ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రస్తుతం తన వినియోగదారులకు తక్కువ ధరకే అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇవి ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే చాలా చవకగా ఉంటాయి. అందుకే చాలమంది యూజర్లు తమ సిమ్ కనెక్షన్‌ను బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ చేస్తుంటారు. అయితే, బిఎస్ఎన్ఎల్ అందించే చవక రీఛార్జ్ ప్లాన్లలో రూ.485 రీఛార్జ్ ప్లాన్ ఒకటి. దాదాపు 72 రోజుల చెల్లుబాటుతో వస్తోన్న ఈ ప్లాన్ రూ.500 కంటే తక్కువ ధరలో ఉండటం విశేషం. ఈ సరసమైన, అద్భుతమైన ప్లాన్ ఇతర టెలికాం కంపెనీల ప్లాన్‌ల కంటే చాలా తక్కువ. ఇప్పుడు ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్‌ రూ.485 రీఛార్జ్ ప్లాన్
72 రోజుల చెల్లుబాటుతో కూడిన ఈ బీఎస్ఎన్ఎల్‌ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.485. ఈ రీఛార్జ్ ప్లాన్  అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను, 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ సందర్భంలో వినియోగదారులు ప్లాన్ అంతటా 144GB డేటాను ఉపయోగిస్తారు. అయితే, రోజువారీ 2GB డేటాను పూర్తి అయినా తర్వాత, ఇంటర్నెట్ వేగం 40kbpsకి పడిపోతుంది. ఇది తగినంత ఇంటర్నెట్ ను అందిస్తుంది.
ఇతర కంపెనీలతో పోలిస్తే సరసమైన ప్లాన్
ఈ బీఎస్ఎన్ఎల్‌ ప్లాన్ ఇతర  ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్  పప్లాన్ల తో పోలిస్తే చాలా సరసమైనది. ఇతర టెలికాం కంపెనీలు సాధారణంగా 72 రోజుల కంటే ఎక్కువ చెల్లుబాటుతో దాదాపు రూ.700 కు రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తాయి. అయితే, బీఎస్ఎన్ఎల్‌ కేవలం రూ.485 కు అన్ని ప్రయోజనాలతో అదే చెల్లుబాటును అందిస్తోంది. ఈ ప్లాన్‌ను  ఫోన్‌పే, పేటీఎం, జీపే లేదా క్రెడిట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్‌ కంపెనీ ఇంటర్నెట్ వేగాన్ని మెరుగుపరచడంపై కూడా దృష్టి సారించింది. బీఎస్ఎన్ఎల్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి సిద్ధమవుతోంది. కంపెనీ పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడిన 4G నెట్‌వర్క్‌ను నిర్మించింది. ఇప్పుడు, ఈ సాంకేతికత ఆధారంగా 5G నెట్‌వర్క్‌కు సిద్ధమవుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad