Bumper Offers in Amazon Diwali Sale: దసరా సందర్బంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో దిమ్మదిరిగే డిస్కౌంట్లు అందించిన అమెజాన్.. ఇప్పుడు దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో మునుపెన్నడూ లేని విధంగా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80% వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, దీపావళి గిఫ్ట్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబర్ 23న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పుడు దీపావళి స్పెషల్‌గా రీబ్రాండ్ చేసి ఈ దివాళీ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో దివాళీ గిఫ్ట్‌లు, ఇతర వస్తువులపై డిస్కౌంట్లు 80% వరకు డిస్కౌంట్లను అందించనుంది. అమెజాన్ దివాళీ సేల్‌లో ఏ ఏ ఉత్పత్తులపై ఎలాంటి ఆఫర్ ఉందో తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ఇన్‌స్టంట్ డిస్కౌంట్..
అమెజాన్ ఇండియాలో భారీ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. తద్వారా అడిషనల్ తగ్గింపుపై ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10% వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక, ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, బ్యూటీ ప్రొడెక్టులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా, ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, మౌస్‌లు, కీబోర్డ్‌లు, సెల్ఫీ స్టిక్‌లు, మొబైల్ స్టాండ్‌లు వంటివి సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, విమాన టికెట్ బుకింగ్‌పై ఫ్లాట్ 10% డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి.
ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్..
అమెజాన్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15పై 31% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను కేవలం రూ.47,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 48MP ప్రైమరీ కెమెరాతో అద్భుతమైన ప్రీమియం ఫీచర్లతో ఐఫోన్ 15 తక్కువ ధరకే అందుబాటులో ఉంది. వీటితో పాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ స్పెషల్ సేల్‌లో సామ్ సంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని శామ్‌సంగ్ గెలాక్సీ M06 5Gను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. దీని 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచింగ్ సమయంలో రూ.9499 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.7999 వద్ద కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో మరింతగా ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. తద్వారా, ఈ ఉత్పత్తులపై మరింత ధర తగ్గుతుంది. అంతేకాదు, మీ పాత స్మార్ట్‌ఫోన్ లేదా పాత ఉత్పత్తులను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా భారీ తగ్గింపును సైతం పొందవచ్చు.


