Amazon-Flikpkart Freedom Sale: ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో ఫ్రీడమ్ సేల్ జరుగుతోంది. ఇందులో అనేక స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఇతర పరికరాలపై అనేక డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి ఈ సేల్ సువర్ణావకాశం. ఈ సేల్ లో కొన్ని 32 అంగుళాల స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరకే లిస్ట్ అయ్యాయి. ఈ స్మార్ట్ టీవీలు HD స్క్రీన్‌తో వస్తుండటం విశేషం. అంతే కాదు, ఇవి ఆండ్రాయిడ్ టీవీ OSలో నడుస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే..? ఈ స్మార్ట్ టీవీలును కేవలం రూ. 7000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ టీవీలలో సినిమాలు, టీవీ షోలు, గేమ్‌ల వంటి కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా టీవీలు ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతిని అందిస్తాయి. ఇప్పుడు రూ. 8000 లోపు వచ్చే టీవీల జాబితా గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Foxsky 32 inch HD Ready Smart Android TV
ప్రస్తుతం ఈ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,999కి అందుబాటులో ఉంది. ఇందులో అంతర్నిర్మిత యాప్ స్టోర్ ఉంది. అందువల్ల, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ టీవీ మెరుగైన సౌండ్ అవుట్‌పుట్‌ను అందించే 30W డాల్బీ-డిజిటల్ స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కాగా, ఈ టీవీ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, HDMI ఆడియో-అవుట్ ఫీచర్‌తో వస్తుంది.
KODAK X900PRO 32 inch HD Ready Smart LED TV
కోడాక్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ LED టీవీలు ఆండ్రాయిడ్ ఆధారితం కాదు. కానీ, యాప్‌లు, వీడియోలను ప్లే చేయడానికి స్మార్ట్ TV ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ టీవీలు 30W ఆడియో అవుట్‌పుట్‌తో వస్తాయి. ఉందులో 3 HDMI, 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ టీవీలు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6999కే సొంతం చేసుకోవచ్చు.
3. SKYWALL Smart LED TV 32SWELS-PRO
స్కైవాల్ స్మార్ట్ LED టీవీ 32SWELS-PRO స్మార్ట్ టీవీ కేవలం రూ.7,299 ధరకే సేల్‌లో లిస్ట్ అయింది. అదనంగా, బ్యాంక్ డిస్కౌంట్ తో దీని ధర రూ.6,500కి కొనుగోలు చేయొచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు, డాల్బీ విజన్ అట్మాస్ సపోర్ట్, బెజెల్-లెస్ డిజైన్ ఉన్నాయి.
4. VW 32S Frameless HD Ready Android Smart LED TV
దీని అమెజాన్ ఇండియాలో రూ.7,599కి కొనుగోలు చేయొచ్చు. అదనంగా, కొనుగోలుదారులు అమెజాన్ పేతో చెల్లిస్తే రూ.300 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇది 178° వైడ్ వ్యూ యాంగిల్, ఫ్రేమ్-లెస్ డిజైన్, IPE టెక్నాలజీ (వైబ్రెంట్ కలర్ కోసం) వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇందులో 20W స్టీరియో సౌండ్, బిల్ట్-ఇన్ Wi-Fi, ఆండ్రాయిడ్ OS, స్క్రీన్ మిర్రరింగ్, మ్యూజిక్ ఈక్వలైజర్, సినిమా జూమ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.


