Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSmartPhones Discounts: దీపావళి ఆఫర్.. ఈ బ్రాండెడ్ ఫోన్ల ధరలు రూ.23000 తగ్గాయి..డోంట్ మిస్..

SmartPhones Discounts: దీపావళి ఆఫర్.. ఈ బ్రాండెడ్ ఫోన్ల ధరలు రూ.23000 తగ్గాయి..డోంట్ మిస్..

Flipkart Diwali Dhamaka Sale: దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 11, 2025 నుండి ప్రారంభమవుతుంది. ప్లస్/బ్లాక్ యూజర్లు ఒక రోజు ముందుగానే యాక్సెస్ పొందుతారు. కంపెనీ ఈ సేల్ లో ఐఫోన్ 16, గూగుల్ పిక్సెల్ 10, శామ్‌సంగ్ గెలాక్సీ S25 వంటి హై-ఎండ్ మోడళ్లపై గణనీయమైన డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే విడుదల చేసిన తన టీజర్‌లో ఇది “బిగ్ బిలియన్ డేస్ ధరలను పొందడానికి చివరి అవకాశం” అని ప్రకటించింది. అంటే మునుపటి సేల్‌లో ఫోన్‌లను కొనుగోలు చేయని వారికి ఇప్పుడు మరొక అవకాశం అని అర్థం. ఇప్పుడు ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Apple iPhone 16

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో అతిపెద్ద హైలైట్ ఏంటంటే? ఆపిల్ ఐఫోన్ 16 డిస్కౌంట్. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.79,900. కానీ, ఇప్పుడు దీని కేవలం రూ.56,150 వేలకు కొనుగోలు చేయవచ్చు. అంటే దాదాపు రూ.23,750 ఆదా అని అర్థం. ఫీచర్ల విషయానికి వస్తే, ఐఫోన్ 16లో A18 బయోనిక్ చిప్‌సెట్, 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 48MP కెమెరా, iOS సపోర్ట్ ఉన్నాయి.

also read:Motorola Edge 70: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..మోటరోలా ఎడ్జ్ 70 వచ్చేస్తోంది..50MP OIS కెమెరా, డాల్బీ స్పీకర్లు!

Google Pixel 10

పిక్సెల్ 10 మార్కెట్లో రూ.79,999 ధరకు లాంచ్ అయింది. అయితే, దీపావళి సేల్ సమయంలో దీనిని రూ.67,999 ధరకు అందిస్తున్నారు. పిక్సెల్ 10 ప్రధాన ఆకర్షణలు దాని గూగుల్ ఏఐ కెమెరా సామర్థ్యాలు, టెన్సర్ G5 చిప్, మెరుగైన ఆండ్రాయిడ్ అనుభవం. ఇది 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, AI-ఆధారిత ఫోటో ఎడిటింగ్, మ్యాజిక్ ఎరేజర్, ఆడియో క్లీనప్ టూల్స్, 7 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కలిగి ఉంది.

Nothing Phone 3a

నథింగ్ ఫోన్ 3a దీపావళి సేల్ సమయంలో కేవలం రూ.20,999కే అందుబాటులో ఉంటుంది. దాని లాంచ్ ధర రూ.29,999. ఫీచర్ల విషయానికి వస్తే, ఇది 6.55-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే (120Hz), స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్‌సెట్, 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ LED సిస్టమ్‌ను కలిగి ఉంది.

Samsung Galaxy S24

కస్టమర్లకు శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్ ఫోన్ గొప్ప డీల్ అవుతుంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర దాదాపు రూ.79,999గా ఉండేది. కానీ, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో దాదాపు సగం ధరకే రూ.38,999కే అందుబాటులో ఉంది. ఇది 6.2-అంగుళాల డైనమిక్ అమోలేడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా సెటప్ కూడా ఆకట్టుకుంటుంది. 50MP ప్రైమరీ, 12MP అల్ట్రా-వైడ్, 10MP టెలిఫోటో లెన్స్, అలాగే సెల్ఫీ కెమెరా 12MP.

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad