Google Pixel 9a Discount: ఫిబ్రవరి 18న గూగుల్ పిక్సెల్ 10a లాంచ్ కు ముందు భారత టెక్ మార్కెట్లో పిక్సెల్ 9a ధర భారీగా తగ్గింది. లాంచ్ సమయంలో దాదాపు రూ.49,000 ధర ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.36,999 ధరకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా, బ్యాంక్ ఆఫర్లు ఉపయోగిస్తే, ధర మరింత తగ్గుతుంది. పిక్సెల్ 10a ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్, అద్భుతమైన కెమెరా, దీర్ఘకాలిక అప్‌డేట్ మద్దతును కలిగి ఉంది.
గూగుల్ పిక్సెల్ 9a పై గణనీయమైన తగ్గింపు
గూగుల్ పిక్సెల్ 9a భారతదేశంలో రూ.49,999 కు లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు విజయ్ సేల్స్ లో ఏకంగా రూ.10వేల తగ్గింపుతో రూ.39,999 కు జాబితా అయింది. పిక్సెల్ 10a అధికారిక లాంచ్ ప్రకటన తర్వాత ఈ ఫోన్ ధర తగ్గడం విశేషం. ప్రీమియం ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులకు ఈ అవకాశం ప్రయోజనకరంగా ఉంటుంది.
also read:Best camera phones: కేవలం రూ.20వేల లోపు ధరలో మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ కొనాలా:.? ఫుల్ లిస్ట్ ఇదే..!
డిస్కౌంట్‌తో పాటు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి EMI లావాదేవీలపై అదనంగా రూ.3,000 డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. ఈ ఆఫర్ ఫోన్ ప్రభావవంతమైన ధరను రూ.36,999కి తగ్గిస్తుంది. దీంతో ఈ ఫోన్ పై మొత్తం రూ.13,000 వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ పరికరంపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
గూగుల్ పిక్సెల్ 9a- ఫీచర్లు
గూగుల్ పిక్సెల్ 9a 120Hz రిఫ్రెష్ రేట్, పూర్తి HD+ రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా రక్షణ పొందుతుంది. ఫోన్ గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ పరికరం 5100 mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో 48MP ప్రధాన సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. అయితే 13MP ముందు కెమెరా అందుబాటులో ఉంది.
లీక్‌ల ప్రకారం..గూగుల్ పిక్సెల్ 10aలో ఎటువంటి పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. అందువల్ల తక్కువ ధరకు లభించే పిక్సెల్ 9a కొనడం చాలా మంది కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. క్లీన్ ఆండ్రాయిడ్, అబ్దుతమైన కెమెరా, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ నవీకరణలు కోరుకునేవారికి ఇది బలమైన ఎంపిక అవుతుంది.

