Motorola g35 5G Discount: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ జరుగుతోంది. ఈ సేల్ ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ నుండి గృహోపకరణాల వరకు అనేక రకాల ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపులు లభిస్తున్నాయి. ప్రధానంగా స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్లతో సరసమైన ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే సరైన అవకాశం. మోటరోలా G-సిరీస్ మోటరోలా G35 5G బడ్జెట్ ఫోన్ ధరకే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆఫర్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ఆఫర్:
ఈ పరికరం 4GBRAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉన్న ఈ ఫోన్ రూ.9,999 ధరకే లాంచ్ అయింది. ఇప్పుడు సేల్ లో భాగంగా ఈ ఫోన్ రూ.8,999కి అందుబాటులో ఉంది. దీని 5% క్యాష్‌బ్యాక్‌తో ఫోన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ రూ.317 నుండి ప్రారంభమయ్యే EMIతో కూడా సొంతం చేసుకోవచ్చు.ఇకపోతే ఈ ఫోన్‌పై రూ.6,690 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు. కాకపోతే ఎక్స్ఛేంజ్ విలువ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
also read:Oppo A6 5G Launched: 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త వాటర్ ప్రూఫ్ 5G ఫోన్..
ఫీచర్లు:
మోటోరోలా నుండి వచ్చిన ఈ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.72-అంగుళాల పూర్తి HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్ప్లే 1000 నిట్‌ల గరిష్ట ప్రకాశ స్థాయిని కలిగి ఉంది. డిస్ప్లే రక్షణ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ 3ని కూడా అందిస్తోంది. ఫోన్ 4GB LPDDR4x RAM, 128GB UFS 2.2 నిల్వతో వస్తుంది. ప్రాసెసర్ యూనిసోక్ T760 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


