Poco M6 Plus 5g: మీరు 108MP కెమెరా ఫోన్ సరసమైన ధరకు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. పోకో M6 ప్లస్ 5G ఖతర్నాక్ డిస్కౌంట్ తో లభిస్తోంది. దీపావళి సందర్బంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ నిర్వహిస్తోంది. ఇందులో ఈ సేల్ లో గృహోపకరణాల నుండి స్మార్ట్‌ఫోన్‌ల వరకు ప్రతిదానిపై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగానే పోకో M6 ప్లస్ 5G గణనీయమైన తగ్గింపును పొందుతోంది. ఈ పరికరం తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది. దీని ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆఫర్:
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ 8GBRAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499 విడుదలైంది. అయితే ఇప్పుడు ఇది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో రూ.9,999 కి లిస్ట్ అయింది. అదనంగా, ఈ ఫోన్‌పై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీరు దీన్ని ₹352 నుండి ప్రారంభమయ్యే EMIతో కూడా కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు దీనిపై గణనీయమైన ఎక్స్ఛేంజ్ బోనస్ పొందుతారు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు డిస్కౌంట్ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఫీచర్స్:
ఫీచర్ల విషయానికి వస్తే..పోకో M6 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ 6.79-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే 550 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. డిస్‌ప్లే రక్షణ కోసం ఇది గొరిల్లా గ్లాస్ 3ని కూడా కలిగి ఉంది. 8GB వరకు RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన ఈ బడ్జెట్ 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 AE ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ OSలో నడుస్తుంది. ఫోటోగ్రఫీ కోసం.. ఇది 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం.. ఈ ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది 5030mAh బ్యాటరీతో 33-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం..ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫోన్ IP53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


