Realme NARZO 80 Lite 4G Discount: మీరు రూ.7000 లోపు ధరలో బిగ్ బ్యాటరీ లైఫ్, స్మూత్ డిస్‌ప్లే, అద్భుతమైన ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం కొనుగోలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ రియల్‌మీ నార్జో 80 లైట్ 4జి పై ఆకట్టుకునే డీల్ అందిస్తోంది. ప్రస్తుతం దీని ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ సైట్ పరికరం కొనుగోలుపై ధర తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా అదనపు పొదుపులను అందిస్తోంది. ఇప్పుడు రియల్‌మీ నార్జో 80 లైట్ 4జి పై ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్
కంపెనీ రియల్‌మీ నార్జో 80 లైట్ 4జి పరికరాన్ని రూ.9,999కు మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఇది ప్రస్తుతం అమెజాన్‌లో రూ.3,201 తగ్గింపు తర్వాత, కేవలం రూ.6,798కే కొనుగోలుకు అందుబాటులో ఉంది. అదనంగా, అమెజాన్ పేని ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా రూ.200 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ పై దాదాపు రూ.4000 ఎక్స్ఛేంజ్ వాల్యూ కూడా పొందవచ్చు. కాకపోతే తగ్గింపు ధర పాత ఫోన్ మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
ఫీచర్లు
ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ (720×1600) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. అంటే, ఇది సున్నితమైన ఉపయోగించవచ్చు. ఈ ఫోన్ మాలి G57 MP1 GPUతో జత చేయబడిన యూనిసోక్ T7250 (12nm ప్రాసెస్) చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫోన్ 18GB వరకు వర్చువల్ RAM, 128GB నిల్వను కలిగి ఉంది. దీనిని మైక్రో SD ద్వారా విస్తరించవచ్చు. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో 13MP ప్రైమరీ సెన్సార్, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు మిలిటరీ-గ్రేడ్ ఆర్మర్‌షెల్ రక్షణతో వస్తుంది. బ్యాటరీ పరంగా..ఈ ఫోన్ 6300mAh బిగ్ బ్యాటరీతో 15W వైర్డ్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


