realme P3x 5G: మీరు కొన్నిరోజులుగా రూ.15,000 లోపు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, మీకో గుడ్ న్యూస్! ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఇది నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. అయితే, ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు మరోసారి సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగానే రియల్‌మీ P3x 5G స్మార్ట్ ఫోన్ ఏకంగా రూ.5,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్ ను పొందుతోంది. ఈ-కామర్స్ సైట్ పరికరం కొనుగోలుపై ధర తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా అదనపు పొదుపులను అందిస్తోంది. ఇది ధరను మరింత తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్
కంపెనీ రియల్‌మీ P3x 5G పరికరాన్ని మార్కెట్లో రూ.16,999 ధరకు లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ పరికరం రూ.5,000 కంటే ఎక్కువ తగ్గింపుతో రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. అదనంగా, కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌పై 5% వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ డీల్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఫోన్‌పై గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇది రూ.10,350 వరకు తగ్గింపును అందిస్తుంది. అయితే, ఈ డిస్కౌంట్ పూర్తిగా పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే..రియల్‌మీ P3x 5G స్మార్ట్ ఫోన్ 6.72-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ 6400 ప్రాసెసర్ కూడా ఉంది. ఇది చాలా శక్తివంతమైనది. కెమెరా పరంగా..ఈ పరికరం 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ముఖ్యంగా, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ ను కలిగి ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


