Samsung Galaxy M07: మీరు చాలా రోజుల నుంచి రూ. 7,000 లోపు శామ్‌సంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనీ ప్లాన్ చేస్తుంటే, మీకో గుడ్ న్యూస్. శామ్‌సంగ్ గెలాక్సీ M07 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రత్యేక దీపావళి డీల్ బంపర్ ఆఫర్‌లను అందిస్తుంది. 4GBRAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ రూ. 6,999 ధరకు లాంచ్ అయింది. అయితే, దీపావళి స్పెషల్ సందర్బంగా ఈ స్మార్ట్ ఫోన్ రూ. 6,799 కు అందుబాటులో ఉంది.
అదనంగా ఈ ఫోన్‌ను రూ. 203 వరకు క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా రూ. 330 నుండి ప్రారంభమయ్యే EMI తో కూడా ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా దీని ధర మరింత తగ్గుతుంది. కాకపోతే ఎక్స్ఛేంజ్ వాల్యూ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఫీచర్ల విషయానికి వస్తే.. శామ్‌సంగ్ గెలాక్సీ M07 స్మార్ట్ ఫోన్ 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ శామ్‌సంగ్ ఫోన్ 4GB LPDDR4x RAM, 64GB eMMC 5.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా..ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OneUI 7పై నడుస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం కంపెనీ LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే, ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.


