Samsung Smart TV Discount: దీపావళికి పండగకు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయలేకపోతే, మీకో గుడ్ న్యూస్! ఇప్పటికీ తక్కువ ధరకే స్మార్ట్ టీవీని కొనాలని చూస్తుంటే, శామ్సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ డీల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సేల్ లో సగం ధరకే టీవీలు, ఉచిత సౌండ్‌బార్, ఎంపిక చేసిన స్మార్ట్ టీవీ లపై 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. అంతేకాదు, ఈ సేల్ సమయంలో టీవీలు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI ఎంపికలు వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. కాగా, ఈ శామ్సంగ్ “ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్”లో క్రిస్టల్ UHD నుండి QLED, నియో QLED వరకు ఉన్న మోడళ్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సేల్ ఆఫర్లను అక్టోబర్ 30 వరకు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో 55″, 65″, 75″, 85″, 98″, 100″,115” సైజులలో విజన్ AI-ఎనేబుల్డ్ టీవీలు ఉన్నాయి. ఇప్పుడు శామ్సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
1. Samsung (43) UE81F Crystal UHD TV
బడ్జెట్‌లో ప్రీమియం 4K స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ స్మార్ట్ టీవీ ఉత్తమ ఎంపిక అవుతుంది. ఈ టీవీ శామ్సంగ్ వెబ్ సైట్ లో దాదాపు రూ.24,990 ధరకు అందుబాటులో ఉంది. ఇది క్రిస్టల్ UHD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన కలర్, బ్రైట్ నెస్ అందిస్తుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి అన్ని ప్రముఖ ఓటిటీ యాప్‌లకు మద్దతు ఇస్తుంది. కొత్తగా 4K టీవీని కొనుగోలు చేస్తుంటే, ఈ మోడల్ దాని ధర పరిధిలో సరైన డీల్.
also read:Discount: శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర తగ్గిందోచ్..ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే..?
2. Samsung (55) QEF1 QLED TV
శామ్సంగ్ 55-అంగుళాల ఈ పండుగ సీజన్‌లో అత్యంత హాటెస్ట్ డీల్స్‌లో QEF1 QLED టీవీ ఒకటి. ఇది క్వాంటం డాట్ టెక్నాలజీతో వస్తుంది. ఇది అద్భుతమైన కలర్, బ్రైట్ నెస్ అందిస్తుంది. ఈ టీవీ 4K QLED ప్యానెల్, HDR10+ మద్దతుతో వస్తుంది. ఇక పోతే, ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్ సమయంలో కస్టమర్లు ఈ టీవీతో ఉచిత సౌండ్‌బార్ లేదా రీప్లేస్‌మెంట్ టీవీని కూడా పొందవచ్చు. 30 నెలల వరకు EMI ఎంపికలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, శామ్సంగ్ వెబ్ సైట్ లో ఈ టీవీ ధర రూ.37,990.
3. Samsung (55) Q8F QLED TV
అల్ట్రా-హై పనితీరు, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ కోసం చూస్తున్నట్లయితే, శామ్సంగ్ (55) Q8F QLED టీవీ ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇది అల్ట్రా HD 4K రిజల్యూషన్, QLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది AI అప్‌స్కేలింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఇది అన్ని కంటెంట్‌ను షార్ప్, వివరణాత్మకంగా చేస్తుంది. ఈ టీవీ ముఖ్యంగా గేమర్‌లకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది వేగవంతమైన రిఫ్రెష్ రేట్, తక్కువ లేటెన్సీ మోడ్, స్మూత్ గేమ్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. ఇంకా, ఈ టీవీ స్లిమ్, ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఏ లివింగ్ రూమ్ లుక్‌నైనా మారుస్తుంది. ఈ టీవీ ప్రస్తుతం శామ్సంగ్ వెబ్ సైట్ రూ.66,290కి అందుబాటులో ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


