Saturday, November 15, 2025
Homeటెక్నాలజీTecno Pova 6 Neo 5G: రూ.11వేల కంటే తక్కువ ధరకే 108MP కెమెరా ఉన్న...

Tecno Pova 6 Neo 5G: రూ.11వేల కంటే తక్కువ ధరకే 108MP కెమెరా ఉన్న ఫోన్!

108MP Camera Phone: ఫోటోగ్రఫీ కోసం తక్కువ బడ్జెట్లో గొప్ప కెమెరా ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, టెక్నో పోవా 6 నియో 5G బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పరికరం 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ రూ.11,999 ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అధునాతన ఏఐ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ 12GB వరకు RAM (6GB రియల్ + 6GB వర్చువల్), 128GB అంతర్గత నిల్వతో వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

also read:Vivo T4x 5G Discount: కేవలం రూ.10,499కే వివో T4x 5G..ఇప్పుడే త్వరపడండి!

టెక్నో పోవా 6 నియో 5G డిస్కౌంట్:

టెక్నో పోవా 6 నియో 5G అసలు ధర రూ.15999. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.11,999 ధరకే లిస్ట్ అయింది. నవంబర్ 30 వరకు ఈ పరికరాన్ని కొనుగోలు చేస్తే, దాదాపు రూ.1,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌తో ఫోన్ రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా, ఈ ఫోన్‌పై రూ.599 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. అంతేకాకుండా, ఈ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ధరను మరింత తగ్గించవచ్చు. కాకపోతే, ఎక్స్ఛేంజ్ విలువ పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుంది.

టెక్నో పోవా 6 నియో 5G ఫీచర్లు:

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ పరికరం 6.67-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ 12GB వరకు RAM (6GB రియల్ + 6GB వర్చువల్), 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా..ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా HiOS 14.5పై నడుస్తుంది. ఫోటోగ్రఫీ కోసం..కంపెనీ వెనుక భాగంలో డ్యూయల్ LED ఫ్లాష్‌తో 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందిస్తుంది. సెల్ఫీల కోసం..ఇది 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం..ఈ పరికరంలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad