Discount: మీరు చాలారోజుల నుంచి రూ.10,000 నుండి రూ.15,000 బడ్జెట్ లో కొత్త 5జి ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? వివో T4x 5G స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఈ పరికరానికి బ్యాంక్ ఆఫర్‌లతో కేవలం రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా దీని రూ.14,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ డీల్, ఫీచర్ల గురించి మరింత తెలుసుకుందాం.
వివో T4x 5G ఆఫర్:
ఈ వివో ఫోన్ అసలు ధర రూ.17,999. కానీ, ప్రస్తుతం ఈ పరికరాన్ని ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ.14,499కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఫోన్‌పై రూ.3,500 వరకు ప్రత్యక్ష తగ్గింపును పొందవచ్చు. ఇంకా, ఈ పరికరంపై మరిన్ని తగ్గింపులను పొందడానికి మరిన్ని గొప్ప బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డులు, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీని వలన ధర కేవలం రూ.10,499కి తగ్గుతుంది. అంతేకాకుండా, ఫోన్ పై రూ.13,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. కాకపోతే ఎక్స్ఛేంజ్ విలువ ఫోన్ మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
also read:Foods For Strong Muscles: 35 ఏళ్ళు దాటితే..కండరాల బలం కోసం మహిళలు తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే..!
వివో T4x 5G ఫీచర్లు:
ఫీచర్ల విషయానికి వస్తే..ఈ ఫోన్ ఇది 6.72-అంగుళాల బిగ్ డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ మన్నికను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ 7300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 700,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌ను కలిగి ఉంది. అదనంగా ఫోన్ AI ఎరేజర్, AI ఫోటో ఎన్‌హాన్స్ వంటి కొన్ని AI ఫీచర్లను కూడా కలిగి ఉంది. కెమెరా పరంగా చూస్తే..ఫోన్ కెమెరా కూడా ఆకట్టుకుంటుంది. ఇది డ్యూయల్ రియర్ కెమరా సెటప్ తో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా. ఈ ఫోన్‌తో 4K రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇది సూపర్ నైట్ మోడ్‌ను కూడా అందిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..ఫోన్ 6500mAh బడా బ్యాటరీతో 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.


