VW Smart QLED Android TV Discount: చాలారోజుల నుంచి ఇంట్లోకి పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ తక్కువగా ఉందా? ఇప్పుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. VW కంపెనీ అందిస్తున్న 40 అంగుళాల స్మార్ట్ QLED ఆండ్రాయిడ్ టీవీ అమెజాన్ లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీని అసలు ధర పై 48% బంపర్ ఆఫర్ అందిస్తూ ఈ టీవీని కేవలం రూ.10,999కే విక్రయిస్తోంది. ఈ టీవీ పై కంపెనీ ఒక సంవత్సరం వారంటీని అందిస్తోంది.
ఈ 40-అంగుళాల టీవీ పూర్తి HD రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 178-డిగ్రీల డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉంది. ఇది 24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌ను, స్టీరియో సరౌండ్ సౌండ్‌తో 5 సౌండ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా..సెట్-టాప్ బాక్స్‌లు, గేమింగ్ కన్సోల్‌లను కనెక్ట్ చేయడానికి దీనికి రెండు HDMI పోర్ట్‌లు ఉన్నాయి. Wi-Fi, LAN ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ లేదా హార్డ్ డ్రైవ్‌లను సులభంగా కనెక్ట్ చేయవచ్చు.
ఈ టీవీ జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియొ, ఈరోస్ నౌ, యూట్యూబ్ వంటి యాప్‌లకు మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తున్న ఇది క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ 4-స్టార్ రేటింగ్ పొందిన ఆండ్రాయిడ్ టీవి కూడా మిరాకాస్ట్ ను అందిస్తుంది. సాధారణంగా 32-అంగుళాల టీవీలు రూ.15,000 రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. అయితే, ఇంత తక్కువ ధరకే 40 అంగుళాల టీవీ అందుబాటులో ఉండటం వినియోగదారులకు కొండడానికి మంచి అవకాశం. ఈ శ్రేణిలో షావోమి ఎల్జీ, థామ్సన్, ఏసర్, మోటరోలా, రియల్‌మి, TCL నుండి టీవీలను సులభంగా కనుగొనవచ్చు.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


