Asus Laptops: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ అనేది కిరాణా, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులను కొన్ని నిమిషాల్లో అందించే క్విక్ కామర్స్ సంస్థ. అయితే ఇప్పుడు ఇండియాలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా తన ల్యాప్‌టాప్‌లను కొన్నింటిని త్వరిత డెలివరీలో అందుబాటులో ఉంచుతామని ఆసుస్ ప్రకటించింది. ఇందులో భాగంగా వివోబుక్ 15, TUF గేమింగ్ F16 వంటి ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ మోడల్‌లు ఉంటాయి.
కాగా మొదట్లో ఈ సౌకర్యం దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఈ 7 నగరాల్లో
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వినియోగదారులు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి ఆసుస్ ల్యాప్‌టాప్‌లను ఆర్డర్ చేయగలరు. ఈ సౌకర్యం బెంగళూరు, ఢిల్లీ-NCR, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణే, కోల్‌కతా వంటి 7 నగరాల్లో అందుబాటులో ఉంది. ఆసుస్ ల్యాప్‌టాప్‌లలో వివోబూక్ 15, వివోబూక్ గో 15, TUF గేమింగ్ F16 కొనుగోలుకు ఉన్నాయి.
Also Read: Laptops Under 30K: రూ. 30 వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు కొనాలా..?అయితే, వీటిపై ఓ లుక్కేయండి..!
Asus Vivobook Go 15 Vivobook 15, TUF Gaming F16 ఫీచర్లు:
ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది AMD Ryzen 3 7320U ప్రాసెసర్, 8GB RAM, 512GB SSD నిల్వను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ మిశ్రమ నలుపు రంగులో వస్తుంది. 1.63 కిలోల బరువు ఉంటుంది.
ఇదే సమయంలో వివోబూక్ 15 15.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కానీ, ఇది 13వ తరం ఇంటెల్ కోర్ i5-1334U ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 1.7 కిలోల బరువు ఉంటుంది.
మరోవైపు.. ఆసుస్ TUF గేమింగ్ F16 అనేది ఇంటెల్ కోర్ 5 చిప్, NVIDIA RTX 3050A GPU (4GB VRAM)తో కూడిన అధిక-పనితీరు గల గేమింగ్ ల్యాప్‌టాప్. ఇది 16GB DDR4 RAM, 512GB PCIe 4.0 NVMe M.2 SSD నిల్వను కలిగి ఉంది. దీని స్క్రీన్ 16-అంగుళాలు, 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ప్రత్యేకమైన కోపైలట్ కీతో RGB బ్యాక్‌లిట్ చిక్లెట్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 56Wh బ్యాటరీని కలిగి ఉంది. విండోస్ 11 హోమ్ Home పై నడుస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఆసుస్ కీబోర్డ్, మౌస్, ఛార్జర్ వంటి ఉపకరణాలను ఇంటి వద్దకే డెలివరీ చేయడానికి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నావిషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ఫామ్ వన్ ప్లస్, ఒప్పో,మోటోరోలా, ఆపిల్,వివో, బోట్, రియల్ మీ వంటి ఇతర బ్రాండ్ల నుండి ఎలక్ట్రానిక్‌లను కూడా అందిస్తుంది.


