లగ్జరీ వస్తువుల(Luxury Items) విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే వస్తువులపై 1 శాతం టీసీఎస్ (Tax Collected at Cource) వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 22 నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం ప్రకటన చేసింది.
చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగులు, రేసింగ్ గుర్రాలు, శిల్పాలు, పెయింటింగ్స్, హై ఎండ్ స్పోర్ట్స్ వేర్, హోం థియేటర్ సిస్టమ్స్, సన్‌గ్లాసెస్, పాదరక్షలు తదితర లగ్జరీ వస్తువులకు ఈ పన్ను వర్తిస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో విక్రయదారులు తప్పనిసరిగా టీసీఎస్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో లగ్జరీ వస్తువుల అమ్మకాలపై నియంత్రణ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.