Cheapest Recharge Plan Of BSNL: భారత టెలికాం కంపెనీల మధ్య తీవ్రపోటీ నెలకొంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అన్ని టెలికాం సంస్థలు పోటీపోటీగా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ యూజర్లకు అధిక ధరలలో రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తుండగా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సైతం అధిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. జియో, ఎయిర్‌టె నెల రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకోవాలంటే దాదాపు రూ.300లకు పైగానే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ తమ యూజర్లను ఆకట్టుకుంటోంది. కేవలం తక్కువ ధరలోనే యానువల్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్..
బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరొక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. దీపావళికి ముందే అతి తక్కువ ధరలో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చి సంచలనం సృష్టించింది. మరోవైపు, 4జీ సేవలను ప్రారంభించింది. అంతేకాదు, ప్రైవేటు సంస్థలకు ధీటుగా ఈ-సిమ్ సేవలను ప్రారంభించి టెలికాం రంగంలో రివల్యూషన్ తీసుకొచ్చింది. అదే సమయంలో కొత్త ప్లాన్‌తో ప్రైవేట్ టెలికాం కంపెనీలను ఆశ్చర్యపరిచింది. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు ఎక్కువ రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అదే సమయంలో ప్రతి రోజు డేటా, ఫ్రీ ఎస్‌ఎమ్‌ఎస్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. దీని ద్వారా ప్రతి నెలా రీఛార్జ్ చేసే తిప్పలు తప్పనున్నాయి. తమ కస్టమర్లకు తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్‌ను తీసుకురావలనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత.. ఏడాది పొడవునా మళ్లీ రీఛార్జ్ చేయడం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రూ.1999లతో ఏడాది వ్యాలిడిటీ..
బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ రూ. 1999లకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ఏకంగా 330 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అంటే యూజర్లు ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 11 నెలల పాటు రీఛార్జ్ చేసుకోవడం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇదే విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ ప్లాన్‌లో యూజర్లు రోజుకు 1.5GB డేటా పొందుతారు. అంతేకాకుండా అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీగా లభిస్తాయి. వీటితో పాటు అక్టోబర్ 15 లోపు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. కస్టమర్లు అదనంగా 2% తక్షణ డిస్కౌంట్ పొందుతారని కంపెనీ పేర్కొంది. అంటే ఈ ప్లాన్‌ను మరింత తక్కువ ధరకు పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌లో యూజర్లను ఆకట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఇదే కావడం విశేషం.


