వనపర్తి జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) టవర్ మంజూరు అయిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి తెలిపారు. బిఆర్ అంబేద్కర్ సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో జి. చిన్నారెడ్డి ఐ.టి టవర్ మంజూరు అంశాలను వెల్లడించారు. వనపర్తిలో ఐటీ టవర్ నిర్మాణం కోసం రూ 22 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చిన్నారెడ్డి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ వన్ తేదీ 11-2-2025 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
గ్రామాల్లో ఐటీ హబ్బులు
వనపర్తి పట్టణ శివారులోని నాగవరం గ్రామంలోని రెండు ఎకరాల స్థలంలో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 25 వేల చదరపు అడుగులలో ఐటీ భవన నిర్మాణం జరుగుతుందని ఈ భవనంలో ఏకకాలంలో 250 మంది ఐటి ప్రొఫెషనల్స్ పనిచేసుకునే సౌకర్యం ఉంటుందని చిన్నారెడ్డి వివరించారు. గ్రామీణ ప్రాంతంలో ఐటి హబ్బులను అభివృద్ధి చేయడంలో భాగంగా వనపర్తికి ఐటి టవర్ మంజూరు అయిందని సామాజిక ఆర్థిక అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి సౌకర్యం కల్పించేందుకు ఈ ఐటి టవర్ ను వనపర్తిలో ఏర్పాటు చేస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. వనపర్తికి మంజూరు అయిన టవర్ ను ఒక సంవత్సరం కాలంలో నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.
వనపర్తిలో చదువుకున్న సీఎం
ఐటీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ స్కూల్ ఐటీ టవర్ నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని వనపర్తి జిల్లాకు ఇది శుభవార్త అని చిన్నారెడ్డి తెలిపే పేర్కొన్నారు. వనపర్తి ప్రాంతంలో విద్యాభ్యాసం చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల ఐటీ టవర్ మంజూరు అయిందని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు.