Saturday, November 15, 2025
Homeటెక్నాలజీCMF Headphone Pro: 'CMF హెడ్‌ఫోన్స్ ప్రో' లాంఛ్..ఒకే ఛార్జ్‌పై 100 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..

CMF Headphone Pro: ‘CMF హెడ్‌ఫోన్స్ ప్రో’ లాంఛ్..ఒకే ఛార్జ్‌పై 100 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..

CMF Headphone Pro Launched: నథింగ్​ సంబ్​ బ్రాండ్ CMF ఆడియో మార్కెట్‌లో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం తన మొట్టమొదటి ఓవర్-ది-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. వీటిని ‘CMF హెడ్‌ఫోన్స్ ప్రో’ పేరిట తీసుకొచ్చింది. ఈ తాజా హెడ్‌ఫోన్‌లు మూడు రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఈ హెడ్‌ఫోన్‌లు 40mm డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఈ తాజా CMF హెడ్‌ఫోన్ ప్రో 40dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), హై-రెస్ ఆడియో ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇది LDAC కోడెక్‌కు మద్దతు ఇస్తుంది. ఇవి సింగల్ ఛార్జ్‌పై 100 గంటల ప్లేబ్యాక్, 50 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇవి బడ్జెట్​ ఫ్రెండ్లీ ధర, ప్రీమియం ఫీచర్లతో వచ్చే మొదటి ఓవర్-ది-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు.

- Advertisement -

CMF హెడ్‌ఫోన్స్ ప్రో ధర, లభ్యత:

ఈ కొత్త CMF హెడ్‌ఫోన్ ప్రో ధర USలో $99 (సుమారు రూ. 8,000) యూరప్‌లో €99 (సుమారు రూ. 10,00), UKలో £79 (సుమారు రూ. 9,420)గా ఉంది. భారతదేశంలో దీని ధర గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. ఈ హెడ్‌ఫోన్‌లు డార్క్ గ్రే, లైట్ గ్రీన్, లైట్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి.

also read: Upcoming SmartPhones: కొత్త ఫోన్ కావాలా..? అక్టోబర్‌లో రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే..ఫుల్ లిస్ట్ ఇదిగో..

CMF హెడ్‌ఫోన్ ప్రో ఫీచర్లు:

CMF హెడ్‌ఫోన్ ప్రో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్‌తో లాంచ్ చేశారు. హెడ్‌ఫోన్‌లు స్విపబుల్ ఇయర్ కుషన్‌లతో వస్తాయి. ఈ కుషన్లు లేత ఆకుపచ్చ, నారింజ రంగులలో అందుబాటులో ఉన్నాయి. CMF హెడ్‌ఫోన్ ప్రోలో వాల్యూమ్ కంట్రోల్ కోసం రోలర్ డయల్, ANC టోగుల్, మ్యూజిక్ ప్లే, పాజ్ బటన్‌లు ఉన్నాయి. వినియోగదారులు బాస్, ట్రెబుల్ స్థాయిలను సర్దుబాటు చేయడానికి అనుమతించే ఎనర్జీ స్లైడర్‌ను కూడా పొందుతారు. CMF హెడ్‌ఫోన్ ప్రో నియంత్రణలను నథింగ్ X యాప్‌ని ఉపయోగించి అనుకూలీకరించవచ్చు. కంపెనీ తాజా హెడ్‌ఫోన్‌లు 40dB వరకు యాంబియంట్ శబ్దాన్ని తగ్గించగలదు. దీని హైబ్రిడ్ ANC ఫీచర్ వినియోగదారులకు మూడు స్థాయిలలో నాయిస్ కంట్రోల్​ చేసుకునే ఆప్షన్స్​ను అందిస్తుంది. అవి లైట్, మీడియం, ఫుల్ బ్లాక్

CMF హెడ్‌ఫోన్ ప్రో శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్ కోసం 40mm డ్రైవర్‌ను కలిగి ఉంది. హెడ్‌ఫోన్‌లు 16.5mm కాపర్ వాయిస్ కాయిల్, బాస్ డక్ట్, డ్యూయల్ ఛాంబర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. హెడ్‌ఫోన్‌లు ఒకే ఛార్జ్‌పై 100 గంటల వరకు ఆడియో ప్లేబ్యాక్‌ను అందిస్తాయని CMF పేర్కొంది, అలాగే 50 గంటల వరకు టాక్ టైమ్‌ను అందిస్తుంది. ANC యాక్టివేట్ చేయడంతో ప్లేబ్యాక్ సమయం 50 శాతం తగ్గుతుంది. ఛార్జింగ్, ఆడియో కనెక్టివిటీ కోసం అవి USB టైప్-C మద్దతును కలిగి ఉంటాయి. కేవలం ఐదు నిమిషాల ఛార్జ్ 5 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad