Friday, January 23, 2026
Homeటెక్నాలజీCredit cards: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలని చూస్తున్నారా?.. ఈ సింపుల్‌ టిప్స్ ఫాలో అయిపోండి..!

Credit cards: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలని చూస్తున్నారా?.. ఈ సింపుల్‌ టిప్స్ ఫాలో అయిపోండి..!

Credit Card Limit Hike: మన రోజూవారి జీవితంలో క్రెడిట్ కార్డులు కూడా అంతర్భాగమైనాయి. అర్జెంటుగా మనీ కావాలంటే క్రెడిట్‌ కార్డులే గుర్తుకొస్తాయి. అంతేకాదు, నెలవారీ బిల్లులు కట్టడం దగ్గరి నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు.. ప్రయాణాల నుంచి వస్తువుల కొనుగోలు వరకు ఇలా ప్రతి దానికీ క్రెడిట్ కార్డులు విరివిగా వాడుతున్నారు. కిరాణా సరుకుల కోసం మరొక కార్డు, షాపింగ్ కోసం ఒక కార్డు, పెట్రోల్ కోసం ఒక కార్డు ఇలా ఒకటికి మించి క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తుంటారు. అయితే, క్రెడిట్‌ కార్డులను సరిగ్గా వినియోగించుకుంటే చాలా ఉపయోగాలున్నాయి. అయితే, వీటి ద్వారా ఎంత పడితే అంత అమౌంట్‌ను ఉపయోగించలేం. మన సిబిల్‌ స్కోర్, శాలరీని బేస్‌ చేసుకొని క్రెడిట్‌ లిమిట్ ఆఫర్‌ చేస్తాయి ఆయా బ్యాంకులు. అయితే, ఆలస్యం కాకుండా పేమెంట్‌ చేయడం ద్వారా క్రెడిట్‌ లిమిట్‌ను పెంచుకునే అవకాశం ఉంటుంది. మన కార్డు వాడకాన్ని బట్టి లిమిట్ పెరుగుతుంది. ఒకవేళ, మీరు మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

లిమిట్ ఎందుకు పెంచుకోవాలంటే..

క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు లిమిట్‌ను పూర్తిగా వాడుకోవడం ద్వారా సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ కోసం కార్డు లిమిట్ లో 30% లోపు మాత్రమే ఉపయోగించుకోవాలి. మరి ఇలాంటప్పుడు ఎక్కువ మొత్తంలో వాడుకోవడం కుదరదు. కాబట్టి కార్డు లిమిట్ పెంచుకోవడం ఒక్కటే ఆప్షన్. ఓవరాల్ లిమిట్ పెరిగితే వాడుకోగలిగిన మొత్తం కూడా పెరుగుతుంది. అందుకే లిమిట్ పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ స్కోర్‌ను బట్టి..

క్రెడిట్ లిమిట్ అనేది క్రెడిట్ స్కోర్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ నెలవారీ ఈఏంఐలు ఎప్పుడూ స్కిప్ చేయకుండా బిల్లులు కడుతున్నట్టయితే బ్యాంకులు ఆటోమేటిక్‌గా క్రెడిట్ లిమిట్ పెంచుతాయి. లేదా మీరే లిమిట్ పెంచమని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

క్రెడిట్ యుటిలైజేషన్

క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఎంత ఉందో గమనిస్తుండాలి. అంటే మీకు ఉన్న అన్ని కార్డుల లిమిట్ లో మొత్తం ఎంత వాడుతున్నారు అనేది తరచూ చూసుకుంటూ ఉండాలి. మీ కార్డుల లిమిట్‌లో 30% కంటే తక్కువగా యుటిలైజ్ చేసుకోవాలి. అంతకు మించి ఉపయోగించకూడదు. అలాగే క్రెడిట్‌ కార్డు బిల్లులను సకాలంలో కట్టాలి. అప్పుడే క్రెడిట్‌ లిమిట్‌ పెరిగే అవకాశం ఉంటుంది.

శాలరీ హైక్

మీ ఆదాయాన్ని బట్టే సంస్థలు మీకు క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. ఒకవేళ మీ ఆదాయం లేదా శాలరీ పెరిగితే క్రెడిట్ కార్డు లిమిట్ కూడా పెరుగుతుంది. అందుకే లిమిట్ పెంచుకోవాలి అనుకునేవాళ్లు ఆదాయాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి. మీ శాలరీ స్లిప్‌ సబ్‌మిట్‌ చేయడం ద్వారా అందుకు తగ్గట్లుగా క్రెడిట్‌ లిమిట్‌ పెంచుతాయి ఆయా బ్యాంకులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News