Saturday, November 15, 2025
Homeటెక్నాలజీAmazon: 'అమెజాన్ ప్రైమ్ డే' సేల్ ముసుగులో సైబర్ నేరగాళ్ల మోసాలు..తప్పించుకునే టిప్స్ ఇవిగో..

Amazon: ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్ ముసుగులో సైబర్ నేరగాళ్ల మోసాలు..తప్పించుకునే టిప్స్ ఇవిగో..

Amazon Prime Day Sale: ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌ అంటే చాలామందికి అమెజాన్‌నే గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా ప్రైమ్ డే సేల్ సమయంలో వినియోగదారులు తక్కువ ధరలకు మంచి డీల్స్ అందుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ, ఈ సందడిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు షాపర్లను మోసం చేయడానికి నకిలీ వెబ్‌సైట్‌లు, తప్పుడు లింక్‌లు రూపొందిస్తుంటారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

సైబర్ మోసగాళ్లు ఎలా వల వేస్తారు?

ప్రైమ్ డే సందర్భంగా అమెజాన్ నుండి వచ్చినట్లు కనిపించే నకిలీ ఈ-మెయిళ్లు లేదా SMSలు పంపిస్తుంటారు మోసగాళ్లు. “మీ ఆర్డర్‌లో సమస్య ఉంది,” లేదా “మీ ఖాతా బ్లాక్ అయింది,” లాంటి సందేశాలు పంపించి, అందులో ఉన్న లింక్‌లపై క్లిక్ చేయమని ప్రేరేపిస్తారు. మీరు ఆ లింక్‌ను ఓపెన్ చేస్తే, అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ పేజీకి తీసుకెళతారు. అక్కడ మీరు లాగిన్ వివరాలు, బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ సమాచారం నమోదు చేస్తే, ఆ వివరాలు నేరుగా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. దీంతో మీ ఖాతాలోని డబ్బు మాయమవుతుందనే సంగతి మర్చిపోకండి.

 

Alsoread: 8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రకారం.. వేతనాలు 34శాతం పెంపు..!
నకిలీ లింక్‌లు గుర్తించడం ఎలా?

1. URL తనిఖీ చేయండి: అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ ఎప్పుడూ `https://www.amazon.in` లేదా మీ ప్రాంతాన్ని బట్టి amazon.com, amazon.co.uk ప్రారంభమవుతుంది. మిగతావి అతి చిన్న మార్పులు ఉన్న లింక్స్ (ఉదాహరణకు amaz0n.com) మోసపూరితమైనవే కావచ్చు.

2. ఈ-మెయిల్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి: అమెజాన్ మీకు పంపే ఏ లింక్ క్లిక్ చేయకుండా, నేరుగా బ్రౌజర్‌లో `amazon.in` టైప్ చేసి వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, ఆర్డర్లను, నోటిఫికేషన్లను తనిఖీ చేసుకోండి.

3. అవాస్తవ ధరలు, ఆఫర్లపై నిఘా: “90% తగ్గింపు”, “ఫ్రీ ఫోన్లు”, “₹10,000 గిఫ్ట్ కార్డ్” లాంటి ఆఫర్లు సాధారణంగా నకిలీవే.

4. స్పెల్లింగ్ తప్పులు: నకిలీ వెబ్‌సైట్‌లలో తరచూ స్పెల్లింగ్ లోపాలు ఉంటాయి. ఇవి మోసపూరితమైనవని గుర్తించడానికి ఒక సూచన.

మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చిట్కాలు

1. అధికారిక యాప్‌ లేదా వెబ్‌సైట్‌ మాత్రమే వాడండి.
2. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) తప్పనిసరిగా ఎనేబుల్ చేయండి.
3. బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లు వాడండి.
4. అధికారిక చెల్లింపు మార్గాల ద్వారానే చెల్లించండి.
5. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు చేయండి.

మీకు ఏదైనా అనుమానం వస్తే ఏ లింక్‌ క్లిక్ చేయకండి. నేరుగా అమెజాన్ అధికారిక కస్టమర్ సేవను సంప్రదించండి. అప్రమత్తంగా ఉండటం ద్వారా మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మీ డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad