Dak Sewa app Features : భారత తపాలా శాఖ తన సేవలను డిజిటల్ యుగానికి సర్దుబాటు చేసేందుకు మరో ముందడుగు వేసింది. ‘డాక్ సేవా’ పేరిట కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఇది పాత ‘పోస్ట్ ఇన్ఫో’ యాప్ స్థానంలో వచ్చింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) రూపొందించిన ఈ యాప్, వినియోగదారులకు 8 రకాల కీలక సేవలను ఒకే చోట అందిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధునిక ఇంటర్‌ఫేస్‌తో ఈ యాప్ పని చేయడం చాలా సులభం. దీంతో ఇకపై పోస్ట్ ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచే పనులు పూర్తి చేయవచ్చు.
ALSO READ: Jubilee Hills: కేసీఆర్ వింత వైఖరి.. దుబ్బాక సీన్ రిపీట్ ఖాయమంటున్న సొంత పార్టీ నేతలు!
యాప్‌లో అందుబాటులో ఉన్న ముఖ్య సేవలు
1. ట్రాకింగ్: స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్శిల్స్, ఈ-మనీ ఆర్డర్‌లను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. ట్రాకింగ్ నంబర్ ఎంటర్ చేస్తే, ప్యాకేజీ ఎక్కడుందో తెలుస్తుంది.
2. పోస్ట్ ఆఫీస్ సెర్చ్: సమీప పోస్ట్ ఆఫీస్ వివరాలు, పని సమయాలు, సేవలు తెలుసుకోవచ్చు. మ్యాప్‌లో లొకేషన్ కనిపిస్తుంది.
3. పోస్టేజ్ కాలిక్యులేటర్: పంపించాలనుకునే పార్శిల్ బరువు, గమ్యస్థానం బట్టి ఛార్జీలు ముందుగా లెక్కించవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది.
4. కంప్లైంట్స్ మేనేజ్‌మెంట్: సమస్యలు ఉంటే ఆన్‌లైన్‌లో కంప్లైంట్ ఫైల్ చేసి, స్టేటస్ చెక్ చేయవచ్చు.
5. ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) ప్రీమియంలను లెక్కించవచ్చు.
6. సేవింగ్స్ స్కీమ్స్ కాలిక్యులేటర్: సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్ వంటి పథకాలపై వడ్డీ వివరాలు తెలుసుకోవచ్చు.
7. డిజిటల్ పేమెంట్స్: బిల్లులు, ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. UPI, కార్డ్‌లు సపోర్ట్ చేస్తుంది.
8. కార్పొరేట్ సేవలు: బిజినెస్ కస్టమర్లకు ప్రత్యేక టూల్స్, రిపోర్టింగ్ ఆప్షన్లు.
ఈ యాప్ ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యాలకు అనుగుణంగా తయారయ్యింది. తపాలా శాఖ 2.0 ప్లాన్‌లో భాగంగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు చేరువ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 1.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్న తపాలా శాఖ, ఈ యాప్‌తో మరిన్ని కోట్లాది మందిని ఆకర్షిస్తుందని ఆశిస్తోంది. డౌన్‌లోడ్ చేసి రిజిస్టర్ అవ్వడం సులభం – మొబైల్ నంబర్, OTPతో పూర్తి. ఈ యాప్ తపాలా సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మారుస్తుంది.


