Saturday, November 15, 2025
Homeటెక్నాలజీMotorola G45 5G : మోటరోలా G45 5G ధర భారీగా తగ్గింది..కొనడానికి ఇదే మంచి...

Motorola G45 5G : మోటరోలా G45 5G ధర భారీగా తగ్గింది..కొనడానికి ఇదే మంచి ఛాన్స్!

Motorola G45 5G Discount: మీరు బడ్జెట్ విభాగంలో మోటరోలా ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్ న్యూస్! ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో పండగ ఆఫర్లు ముగిసినప్పటికీ, కొని స్మార్ట్ ఫోన్ల పై ఆఫర్లు అలానే ఉన్నాయి. గత సేల్స్ లో స్మార్ట్ ఫోన్ కొనకపోతే, ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఈ అద్భుతమైన డీల్ మోటరోలా G45 5G పై ఉంది. 8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర అమెజాన్ ఇండియాలో రూ.12,440 కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ ద్వారా మీరు ఫోన్‌పై రూ.1,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌తో మీరు ఈ ఫోన్‌ను రూ.11,500 కు పొందవచ్చు. అదనంగా, ఫోన్‌పై రూ.373 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అందించే డిస్కౌంట్ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

- Advertisement -

ఫీచర్ల విషయానికి వస్తే..ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ స్థాయితో వస్తుంది. డిస్‌ప్లే రక్షణ కోసం ఫోన్ గొరిల్లా గ్లాస్ 3తో కూడా వస్తుంది. ఫోన్ 8GB వరకు LPDDR4x RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా My UX పై నడుస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం..16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఫోన్ 5000mAh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం, ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. శక్తివంతమైన ధ్వని కోసం, ఫోన్ డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad