Doogee fire 5ultra and fire 5pro: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. స్మార్ట్‌ఫోన్ తయారీదారు డూగీ త్వరలో మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కంపెనీ రాబోయే స్మార్ట్‌ఫోన్‌లను ఫైర్ 5 ప్రో, ఫైర్ 5 అల్ట్రా పేరిట తీసుకురానుంది. కంపెనీ ఈ ఫోన్లలో మన్నికైన డిజైన్‌లు, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యాలను అందించనుంది. అయితే, ఈ రెండు రాబోయే స్మార్ట్‌ఫోన్‌లను వాటి లాంచ్‌కు ముందే GSMArena గుర్తించింది. ఈ క్రమంలో రాబోయే రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్ల గురించి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రెండు ఫోన్‌లు NFC, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అనుకూలీకరించదగిన కీ వంటి ఫీచర్లతో వస్తాయి. ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, బ్లేజ్ ఆరెంజ్, ట్విలైట్ గ్రే రంగులలో లాంచ్ అవుతుంది. ధర విషయానికి వస్తే, డూగీ ఫైర్ 5 ప్రో ధర $169.99 (సుమారు రూ. 15,000), ఫైర్ 5 అల్ట్రా ధర $199.99 (సుమారు రూ. 17,800)గా ఉంటుంది.
aslo read:Lava Bold N1 Lite: కేవలం రూ. 5,698కే లావా బోల్డ్ N1 లైట్.. ఇప్పుడే త్వరపడండి!
డూగీ ఫైర్ 5 అల్ట్రా ఫీచర్లు( అంచనా)
నివేదికల ప్రకారం.. . ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. డూగీ ఫైర్ 5 అల్ట్రా లో మీడియాటెక్ హీలియో G81 చిప్‌సెట్ అందించనున్నారు. ఈ ఫోన్ 8GBRAM+ 256GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ స్లాట్‌తో 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే, అల్ట్రా మోడల్ 48MP ఓమ్నివిజన్ OV48B2Q ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8MP సోనీ IMX355 ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 13,000 mAh బ్యాటరీతో 18W వైర్డు, 5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
డూగీ ఫైర్ 5 ప్రో ఫీచర్లు (అంచనా)
డూగీ ఫైర్ 5 ప్రో విషయానికొస్తే, దీని డిజైన్, డిస్ప్లే అల్ట్రా మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఈ పరికరం 13MP శామ్సంగ్ ఐసోసెల్ S5K3L6 కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4GBRAM+128GB స్టోరేజ్‌తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ MIL-STD-810H మన్నిక IP68, IP69K సర్టిఫికేషన్‌తో వస్తుంది.


