Friday, January 31, 2025
Homeటెక్ ప్లస్E spoon: ఈ స్పూన్‌తో తింటే బీపీ మాయం

E spoon: ఈ స్పూన్‌తో తింటే బీపీ మాయం

గుడ్ న్యూస్ టు బీపీ పేషెంట్స్

కిరిన్‌ అనే జపాన్‌ కంపెనీ ఈ టేస్ట్ బడ్స్​‍ స్పూన్ని తయా­రు­చే­సింది. వీక్‌ ఎల­క్ట్రిక్‌ వేవ్స్​‍ ద్వారా ఈ స్పూన్‌ మన నాలు­కకు మనం తినే ఆహా­రంలో ఉప్పు ఉన్న­ట్లుగా ఒక భావ­నను కల్పి­స్తుంది. అసలు ఉప్పు వేయని వంట­కాలు తిన్న, చివ­రికి చక్కె­రను తిన్న మనం ఉప్పుతో కూడిన రుచి­క­ర­మైన వంట­కాన్ని తిన్న సంతృప్తి కలి­గి­స్తుంది. ప్రపం­చ­వ్యా­ప్తంగా ఉప్పు పెద్ద సమ­స్యగా మారింది. సాల్ట్ లేకుండా వంటలు తినలేం. అలా అని సాల్ట్ ఎక్కు­వగా తింటే వచ్చే జబ్బుల సంఖ్య చాలా ఎక్కువే. ఉప్పులో ఎక్కు­వగా ఉండే సోడియం మన శరీ­రంపై చూపించే ప్రభావం ప్రాణాల మీదకు తీసు­కొ­స్తుం­దం­టు­న్నారు వైద్య నిపుణులు. దానికి తోడు కొత్తగా మార్కె­ట్లోకి రక­ర­కాల పేర్లతో కంపె­నీలు సాల్ట్ ప్యాకె­ట్లను తీసు­కొ­స్తు­న్నాయి. ఇలాంటి వాటితో ప్రాణా­లకే ముప్పు వాటి­ల్లిం­తుం­దం­టు­న్నారు డాక్టర్లు.

- Advertisement -

మనం 10 గ్రాములకు తక్కువ తినట్లేదే
రోజు ఐదు గ్రాముల వరకు ఉప్పు తినడం మేలు. కానీ భార­త­దే­శంలో ఇక్కడి స్టైల్‌ వంట­కాల్లో కనీసం ఒక్కో మనిషి ఎని­మిది నుంచి 10 గ్రాముల ఉప్పును తీసు­కుం­టు­న్నారు. ప్రపం­చ­వ్యా­ప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి పరి­స్థితి ఉంది. దీని­వల్లే ముందుగా బ్లడ్‌ ప్రెషర్‌ పెరు­గు­తుంది. కడు­పులో క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఒబె­సిటీ, మహి­ళ­లకు అయితే అధిక ఉప్పు తీసు­కో­వడం వల్ల ఇంకా చాలా ప్రమా­దాలు ఉన్నా­యని వైద్య నిపు­ణులు హెచ్చ­రి­స్తు­న్నారు.

ఉప్పులేని కూడు.. నో వే
బీపీ రాగానే డాక్టర్‌ మొదటి చెప్పే మాట ఉప్పు తగ్గిం­చ­మని. కానీ ఉప్పు లేకుండా తినడం చాలా­మంది అల­వాటు చేసు­కో­లే­క­పో­తు­న్నారు. ఆ తర్వాత కొద్ది కాలా­నికి ఉప్పు లేకుండా తినడం అనే విష­యాన్ని మర్చి­పో­తారు. అవ­స­ర­మైతే ఇంకొన్ని మందు గోలీలు వేసు­కుంటాం కానీ ఉప్పు లేకుండా తిన­లేము అనే స్థాయికి వచ్చే­స్తు­న్నారు. దేశంలో రోజు­రో­జుకు పెరు­గు­తున్న బీపీ పేషెంట్ల సంఖ్యకు అసలు కారణం సాల్ట్‍. అయితే ఈ సాల్ట్ కు విరు­గుడు కని­పె­ట్టింది ఒక జపాన్‌ కంపెనీ. లాస్ వేగా­స్లో జరు­గు­తున్న కన్జ్యూ­మర్‌ ఎల­క్ట్రా­నిక్స్​​‍ షోలో ఈ కొత్త రకం స్పూన్‌ విడు­దల చేశారు. ప్రతి ఏడాది కన్జ్యూ­మర్‌ టెక్నా­లజీ అసో­సి­యే­షన్‌ ప్రపం­చ­వ్యా­ప్తంగా కొత్త కొత్త ఆవి­ష్క­ర­ణ­లకు ఒక వేది­కను ఏర్పాటు చేస్తుంది. కిరిన్‌ అనే జపాన్‌ కంపెనీ ఈ టేస్ట్ బర్డ్స్​‍ స్పూన్ని తయా­రు­ చే­సింది. వీక్‌ ఎల­క్ట్రిక్‌ వేవ్స్​‍ ద్వారా ఈ స్పూన్‌ మన నాలు­కకు మనం తినే ఆహా­రంలో ఉప్పు ఉన్న­ట్లుగా ఒక భావ­నను కల్పి­స్తుంది. అసలు ఉప్పు వేయని వంట­కాలు తిన్న, చివ­రికి చక్కె­రను తిన్న మనం ఉప్పుతో కూడిన రుచి­క­ర­మైన వంట­కాన్ని తిన్న సంతృప్తి కలి­గి­స్తుంది. టెక్ని­క­ల్‌గా నాలు­కపై చిన్న చిన్న అతి సున్ని­త­మైన నరాలు ఉంటాయి. వాటిని సూక్ష్మ­స్థా­యిలో ఎల­క్ట్రిక్‌ తరం­గా­లకు గురి చేయడం ద్వారా ఉప్పు రుచి నాలు­కకు తగు­లు­తుంది. ఇలా ఆహా­రంలో ఉప్పు లేకున్నా, ఉప్పు రుచితో తిన్నా­మన్న అను­భూ­తిని కలి­గి­స్తుంది.

మూడు నెలల్లో మార్కెట్లోకి
సైన్స్​‍ను ఉప­యో­గించి ఈ టేస్ట్ బడ్స్ స్పూన్‌ని తయారు చేసింది ఈ జపాన్‌ కంపెనీ. ఇది బ్యాట­రీతో పని­చే­స్తుంది. ఇందులో నాలుగు రకాల సెట్టింగ్లు ఉంటాయి. మన అభి­రు­చికి తగ్గ­ట్లుగా ఎంత ఉప్పు తినా­ల­ను­కుంటే ఆ సెట్టిం­గ్‌లో పెట్టు­కో­వచ్చు. ఎలాంటి ప్రమాదం లేదని జపాన్‌ డాక్టర్స్​‍ అసో­సి­యే­షన్‌ కూడా దీన్ని సర్టిఫై చేశారు. అంతే­కాదు ఇది ఉప­యో­గిం­చడం వల్ల ఉప్పు లేకుండా వంటలు తిని ఆరో­గ్యంగా కూడా తయా­ర­వ్వచ్చు. ఇండియా మార్కెట్లో ఇంకా రిలీజ్‌ అవ్వ­డా­నికి రెండు మూడు నెలల సమయం పట్టే అవ­కాశం ఉంది. ఇప్ప­టికీ జపాన్‌ అమె­రికా మార్కెట్లో వచ్చే­నెల రిలీజ్‌ చేయ­డా­నికి కంపెనీ సిద్ధ­మ­వు­తుంది. అయితే ఈ టేస్ట్ బడ్స్ ‍ స్పూన్‌ ధర ఇండి­యన్‌ కరె­న్సీలో 10,000 రూపా­యలు. ధర కాస్త ఎక్కు­వైనా ఉప­యో­గాలు మాత్రం చాలా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News