Saturday, November 15, 2025
Homeటెక్నాలజీElista QLED Google TV: ఇంట్లోనే సినిమా హాల్..మార్కెట్లోకి ఎలిస్టా క్యూఎల్‌ఇడి గూగుల్ టీవీ..

Elista QLED Google TV: ఇంట్లోనే సినిమా హాల్..మార్కెట్లోకి ఎలిస్టా క్యూఎల్‌ఇడి గూగుల్ టీవీ..

Elista QLED Google TV Launched: ఇండియాలో పండుగ సీజన్‌ స్టార్ట్ అయింది. అనేక ఎలక్ట్రిక్ పరికరాల కంపెనీ తయారీదారులు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ప్రొడక్ట్స్ ను మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే భారతదేశంలో క్యూఎల్‌ఇడి స్మార్ట్ టీవీలను ఎలిస్టా విడుదల చేసింది. ఎలిస్టా తాజా క్యూఎల్‌ఇడి స్మార్ట్ టీవీ లైనప్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి. అవి 32-అంగుళాలు, 43-అంగుళాలు, 55-అంగుళాలు. ఈ టీవీలు ఆండ్రాయిడ్ ఆధారిత గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తాయి. ఈ టీవీలను 4K UHD రిజల్యూషన్, 2GB వరకు ర్యామ్, 16GB వరకు నిల్వతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎలిస్టా క్యూఎల్‌ఇడి గూగుల్ టీవీలకు సంబంధించి ధర, స్పెసిఫికేషన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

Elista QLED Google TV ధర:

కంపెనీ ఎలిస్టా క్యూఎల్‌ఇడి గూగుల్ టీవీ 32-అంగుళాల మోడల్ ధర రూ. 23,990గా పేర్కొంది. ఇక 43-అంగుళాల ధర రూ. 35,990గా, 55-అంగుళాల టీవీ ధర రూ. 69,990గా నిర్ణయించింది. అయితే స్మార్ట్ టీవీలను ప్రధాన రిటైల్ దుకాణాల నుండి కొనుగోలు చేయవచ్చు.

 

Elista QLED Google TV స్పెసిఫికేషన్లు:

32-అంగుళాల, 43-అంగుళాల మోడళ్ల గురించి మాట్లాడితే..ఇవి HD (720p), పూర్తి-HD (1080p) రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తాయి. మరోవైపు..55-అంగుళాల మోడల్ 4K UHD రిజల్యూషన్‌తో HDR10కి సపోర్ట్ చేస్తుంది. కాగా, ఈ ఎలిస్టా తాజా టీవీలు బెజెల్-లెస్ ఫ్రేమ్ డిజైన్‌తో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ మూడు మోడళ్లు టీవీలు ఆండ్రాయిడ్ ఆధారిత గూగుల్ టీవీ ఓస్ పై నడుస్తాయి. అంటే.. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి టీవీలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ALSO READ: Smart Tv: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. రూ.20 వేల కంటే తక్కువ ధరలో 43 అంగుళాల స్మార్ట్ టీవీలు..

ఎలిస్టా క్యూఎల్‌ఇడి గూగుల్ టీవీలు అంతర్నిర్మిత 48W సౌండ్‌బార్ స్పీకర్‌లతో వస్తాయి. ఈ టీవీలు డాల్బీ ఆడియోకు మద్దతు ఇస్తాయి. ఇది ఇంట్లో వినియోగదారులకు థియేటర్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా.. కంపెనీ ఈ స్మార్ట్ టీవీలలో గూగుల్ క్రోమ్ కాస్ట్ కోసం కంపెనీ మద్దతును అందించింది. దాని సహాయంతో వినియోగదారులు తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను టీవీలో ప్రసారం చేయవచ్చు.

32-అంగుళాల, 43-అంగుళాల మోడళ్లలో కంపెనీ 1.5GB RAM, 8GB అంతర్గత నిల్వను అందించింది. దీనితో పాటు 55-అంగుళాల మోడల్‌లో 2GB RAM, 16GB నిల్వ ఉంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, యూట్యూబ్, సోనీ LIV వంటి యాప్‌లు ఈ టీవీలో అందుబాటులో ఉన్నాయి. ఇక కనెక్టివిటీ కోసం..ఎలిస్టా QLED గూగుల్ టీవీలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi (2.4GHz/5GHz), మూడు HDMI పోర్ట్‌లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad