Homeటెక్నాలజీFlagship phones: ఖరీదైన ఫోన్ కొనే ప్లాన్ ఉందా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా గమనించండి

Flagship phones: ఖరీదైన ఫోన్ కొనే ప్లాన్ ఉందా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా గమనించండి

Flagship phones: మార్కెట్‌లో కొత్త కొత్త ఫోన్లు వరుసగా వస్తున్నాయి. ప్రతి నెలా కొత్త మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. కొందరు మాత్రం నేరుగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లనే కొనాలని చూస్తారు. ఎందుకంటే ఇవి కంపెనీల అత్యంత ప్రీమియం మోడల్స్‌గా వస్తాయి. కెమెరా, పర్‌ఫార్మెన్స్, డిజైన్ లాంటి విషయాల్లో ఇవి టాప్‌లో ఉంటాయి. అందుకే చాలామంది రూ. 80,000, రూ. 1,00,000 వరకు ఖర్చు చేసి కూడా ఈ ఫోన్లు కొనేస్తున్నారు. కానీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనేటప్పుడు ప్రయోజనాలే కాదు, కొన్ని మైనస్ పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి.

- Advertisement -

స్టేటస్ సింబల్‌గా ఫోన్లు

ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు గురించి మాట్లాడితే.. చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్ కూడా పెద్ద కారణం. అప్‌డేటెడ్ లుక్ కూడా చాలామందిని ఆకర్షిస్తుంది. అందుకే చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ ఫోన్లు కొనాలని అనుకుంటారు. ఫీచర్ల కోసం మాత్రమే కాదు. సమాజంలో స్టేటస్ సింబల్‌గా కూడా ఈ ఫోన్లు మారిపోయాయి. చేతిలో ఖరీదైన ఫోన్ ఉంటే అది ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠగా భావించే పరిస్థితి ఏర్పడింది. కొందరికి ఇది అవసరానికి మించి ఒక స్టైల్‌గా మారిపోయింది.

విలువ వేగంగా తగ్గిపోవడం

ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనడంలో మొదటి పెద్ద మైనస్ విలువ చాలా వేగంగా తగ్గిపోవడం. ఒక కొత్త సిరీస్ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే పాత మోడల్స్ ధరలు పడిపోతాయి. ఉదాహరణకు మీరు ఒక ఫోన్‌ను రూ. 1,00,000 పెట్టి కొంటే. కొన్ని నెలల్లోనే దాని ధర రూ. 70,000 లేదా రూ. 60,000 వరకు పడిపోవచ్చు. అంటే చాలా తక్కువ సమయంలోనే ధర తగ్గిపోతుంది. కొత్త ఫోన్ లాంచ్ అయినప్పుడు పాత మోడల్ విలువ ఒక్కసారిగా పడిపోవడం చాలా మందికి నిరాశ కలిగించే విషయం.

Read Also: Mahindra BE6: ఇండియన్ మార్కెట్‌లో మహీంద్రా మ్యాజిక్.. హాట్ కేకుల్లా సేల్ అయిన BE 6 స్పెషల్ ఎడిషన్

రీసేల్ విలువ తగ్గిపోవడం

ఇది ముఖ్యంగా సామ్‌సంగ్ లాంటి బ్రాండ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త సిరీస్ విడుదలైన వెంటనే పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్లు తక్కువ ధరకు అమ్ముడవుతాయి. ఇది కొత్తగా కొనాలనుకునే వారికి మంచిదే. కానీ ముందుగా ఎక్కువ ధర పెట్టి కొనిన వారికి మాత్రం రీసేల్ విలువ చాలా తగ్గిపోతుంది. ఫోన్‌ను మళ్లీ అమ్మాలనుకుంటే మంచి ధర రావడం కష్టం. కొన్నిసార్లు ఫోన్ ధర సగానికి కూడా తగ్గిపోవచ్చు.

రిపేర్ ఖర్చు షాక్

రెండో పెద్ద సమస్య రిపేర్ ఖర్చు. ఖరీదైన ఫోన్ అంటే దాని సర్వీస్ ఖర్చు కూడా ఖరీదుగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్క్రీన్ పగిలితే. దాన్ని మార్చడానికి సుమారు రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు ఖర్చు కావచ్చు. అదే డబ్బుతో ఒక మంచి మిడ్ రేంజ్ ఫోన్ కొనగలిగే పరిస్థితి ఉంటుంది. ఫోన్ కెమెరా లేదా ఇతర భాగాలు దెబ్బతిన్నా కూడా ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మెయింటెనెన్స్ చాలా ఖరీదుగా ఉంటుంది.

అవసరం లేని ఫీచర్లు

మూడో మైనస్ అవసరం లేని ఎక్కువ ఫీచర్లు. ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కంపెనీలు చాలా ఆధునిక ఫీచర్లు ఇస్తాయి. కానీ వాటిలో చాలా ఫీచర్లు సాధారణ వినియోగదారులు రోజూ ఉపయోగించరు. ఉదాహరణకు 100x జూమ్ కెమెరా, శాటిలైట్ కనెక్టివిటీ, 8K వీడియో రికార్డింగ్. ఇవి అందరికీ అవసరం ఉండవు. అయినప్పటికీ ఈ ఫీచర్ల వల్ల ఫోన్ ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది.

మిడ్ రేంజ్ ఫోన్లతో కూడా సరిపోతుంది

వాస్తవానికి చాలా మంది ఫోన్‌ను కాల్స్, సోషల్ మీడియా, ఫోటోలు తీయడం కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాంటి వినియోగానికి రూ. 25,000 లేదా రూ. 30,000 మిడ్ రేంజ్ ఫోన్ కూడా తగినంత పర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. మంచి కెమెరా కూడా అందిస్తుంది. బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది. సాధారణ వినియోగానికి ఇలాంటి ఫోన్లు చాలామందికి సరిపోతాయి.

కొనేముందు ఆలోచన అవసరం

అందుకే ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనేముందు కేవలం ఫీచర్లను మాత్రమే చూడకుండా. దాని మైనస్ పాయింట్లను కూడా ఆలోచించడం మంచిది. విలువ త్వరగా తగ్గిపోవడం. రిపేర్ ఖర్చు ఎక్కువగా ఉండటం. అవసరం లేని ఫీచర్లు ఉండటం. ఈ విషయాలు కూడా గుర్తుంచుకుంటే సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఫోన్ కొనుగోలు చేసే ముందు అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకుంటే డబ్బు కూడా సేవ్ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News